జూన్ 26, 2026

WhatsApp Image 2025 01 30 at 20.00.55

TRINETHRAM NEWS

ప్రజా సేవకునిగా అభివృద్ధికి వారధిగా ఎల్లవేళలా ప్రజలకు అండగా ఉంటాను : ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు

కాల్వశ్రీరాంపూర్ మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని కెజిన్ ఫంక్షన్ లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల,కార్యకర్తల సమావేశంలో ముఖ్యఅతిధిగా హాజరై నాయకులకు, కార్యకర్తలకు పలు సూచనలు చేసిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణా రావు మాట్లాడుతూ

రైతుల పొలాలు తడిస్తే నా కడుపు నిండినంత సంతోషం అవుతుందని అందుకే టేలాండ్ ప్రాంతాలకు శాశ్వతంగా తాగునీరు అందించేందుకు పత్తిపాక రిజర్వాయర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది ప్రభుత్వం కూడా పత్తిపాక రిజర్వాయర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం సానుకూలంగా ఉంది.కాల్వ శ్రీరాంపూర్ హుస్సేన్ మియా వాగుకు నిరంతరం సాగునీరు అందిస్తాను అన్నారు. అదేవిధంగా పెద్దపెల్లి బస్సు డిపో ఏర్పాటుకు సహకరించిన సి ఎం రేవంత్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.పెద్దపల్లి లో 50 పడకల ఆసుపత్రి ని 100 పడకలు చేయడం జరిగింది అన్నారు.ఎం.ఆర్.ఐ, ఇతర సేవలు త్వరలో ఈ ఆసుపత్రి లో జరుగుతాయి అన్నారు.కాల్వశ్రీరాంపూర్ నుంచి పొత్కపల్లి ,గుంపుల,తనుగుల రోడ్ పనులకు నిధులు మంజూరు కాగా పనులు నడుస్తున్నాయి అన్నారు. వెన్నంపల్లి రింగ్ రోడ్డుకు 7 కోట్లు మంజూరు చేశానని త్వరలో పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. హుస్సేన్ మియా వాగు ద్వారా రైతులకు సాగునీరు అందించేందుకు నాతోపాటు సారయ్య గౌడ్ కూడా అహర్నిశలు కృషి చేస్తున్నారు అన్నారు.

కాల్వ శ్రీరాంపూర్ లో గతంలో 30 పడకల ఆసుపత్రి ఉండగా బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు పడకలుగా మారిందని ఈ విషయంపై సీఎం దృష్టికి తీసుకు పోయానని త్వరలో 30 పడకల ఆసుపత్రి అవుతుంది అన్నారు. కిష్టంపేట లో మానేరు పై బ్రిడ్జి కట్టేందుకు కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలవడం జరిగిందని, బ్రిడ్జి మంజూరుకు నిధులు తప్పకుండా మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. మానేరులో గుంటి మడుగు లో చెక్ డ్యామ్ కట్టాలని రైతుల ఆకాంక్షను గత 30 ఏళ్లుగా చూస్తున్నానని, అప్పటి ఐడీసీ చైర్మన్ ఈద శంకర్ రెడ్డి గుంటిమడుగు ఎత్తిపోతల పథకం కు నిధులు మంజూరి చేయించే దశలోనే అప్పటి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అడ్డుపడ్డాడని ఈద శంకరన్నే నాకు స్వయంగా చెప్పడం జరిగిందని ఎమ్మెల్యే అన్నారు.

గుంటి మడుగు ప్రాజెక్టు కోసం తప్పకుండా కృషి చేస్తాను అన్నారు. 14 రోజులు 280 కిలోమీటర్లు ఈ నియోజకవర్గంలో పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకున్నానని ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం 13 నెలలోనే 1000 కోట్ల నిధులు సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో తీసుకు రావడం జరిగింది అన్నారు. కార్యకర్తలు ఒక్కతాటిపై ఉండి కాంగ్రెస్ పెట్టిన పలు పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని ఎమ్మెల్యే సూచించారు.

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా గ్రంధాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మార్కెట్ చైర్మన్లు మినిపల ప్రకాష్ రావు, రామిడి తిరుపతి రెడ్డి, ఈర్ల స్వరూప మరియు మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, మాజీ జడ్పీటీసీ లంక సదయ్య,మండల అధ్యక్షులు గజనవేన సదయ్య,సింగిల్ విండోచైర్మన్ చదువు రాంచంధర్ రెడ్డి, సబ్బానీ రాజమల్లు,తుల మనోహర్ రావు,ఎండ్ మునీర్, పులి ఇంద్రకరణ్ రెడ్డి,బంగారి రమేష్, సోనాయిటెంకం శివ, సునీల్ రావు,మాదాసు సతీష్,మరియు మాజీ సర్పంచ్ లు, ఎంపీటీసీ లు మరియు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page