జూన్ 26, 2026

WhatsApp Image 2025 01 29 at 20.38.42

TRINETHRAM NEWS

పశ్చిమ సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం..9 మంది భారతీయుల మరణం

Trinethram News : సౌదీ : పశ్చిమ సౌదీ అరేబియాలో దురదృష్టకర ఘటన చోటుచేసుకుంది. జియాన్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది భారతీయులు మృతిచెందారు. జెడ్డాలోని భారతీయ రాయబార కార్యాలయం బుధవారంనాడు సోషల్ మీడియా పోస్ట్‌లో ఈ వివరాలు వెల్లడించింది. జిజాన్ సమీపంలోని జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది భారతీయ పౌరులు మరణించడంపై తీవ్ర సంతాపాన్ని తెలియజేసింది. అధికారులతోనూ, మృతుల కుటుంబాలతోనూ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతన్నట్టు తెలిపింది. హెల్ప్‌లైన్ సైతం ఏర్పాటు చేసినట్టు పేర్కొంది.

జడ్డాలో జరిగిన ప్రమాద ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడంపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్న జెడ్డాలోని కాన్సుల్ జనరల్‌‌తో మాట్లాడానని, పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నట్టు తనకు వివరించారని సోషల్ మీడియా పోస్ట్‌లో జైశంకర్ తెలిపారు.

8002440003(టోల్ఫ్రీ)

0122614093

0126614276

0556122301(వాట్సాప్)

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page