Tribal Rights : గిరిజన హక్కులకు చట్టబద్ధత కల్పించాలని గ్రామస్తులతో నిరసన,కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు.చిట్టం బలబద్దర్

TRINETHRAM NEWS

గిరిజన హక్కులకు చట్టబద్ధత కల్పించాలని గ్రామస్తులతో నిరసన,కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు.చిట్టం బలబద్దర్

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ జనవరి 28:

ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాచిపెంట శాంత కుమారి ఆదేశాల మేరకు అరకువేలి మండలము గన్నెల పంచాయతీ గన్నెల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు చిట్టం నాయక్ బలబద్దర్ గ్రామస్తులతో కలిసి ప్లే కార్డులు పట్టుకుని నిరసన తెలిపారు, చిట్టం నాయక్ బలబద్దర్ మాట్లాడుతూ గిరిజన నిరుద్యోగులకు 100% రిజర్వేషన్ జీ ఓ నెంబర్ 3 చట్టబద్ధత కల్పించాలి, అలాగే కూటమి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ నెరవేర్చాలి గిరిజనులకు కేటాయించిన ఉద్యోగాలు వందకు వంద శాతం గిరిజనులకే కల్పించాలి ,అని నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది
ఈ కార్యక్రమంలో గ్రామస్తులు శెట్టి అప్పాలు, శెట్టి కళావతి, పి లక్ష్మణ్, బీ బీ చందర్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top