కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సమక్షంలో ఘనంగా నేతాజీ పుట్టినరోజు వేడుకలు:
అరకువేలి,త్రినేత్రం న్యూస్,జనవరి 24.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాచిపెంట శాంతకుమారి ఆదేశాల మేరకు,అరకు వేలి నియోజకవర్గము, అరకువేలి మండల కేంద్రము సి కొలని వద్ద. అరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు,నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినం సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా,ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పాచిపెంట చిన్నస్వామి.
మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధుడు ఉద్యమనేత తేదీ23.1.1897న తండ్రి జానకి నాథ్ బోస్ తల్లి ప్రభావతి దాత్ బోస్ దంపతులకు ఒరిస్సా రాష్ట్రంలో కటక్ పట్టణంలో జన్మించడం జరిగింది,భారతదేశ స్వాతంత్రం కోసం ముందు ఉండి పోరాడి బ్రిటిష్ తెల్ల దొరలను తరిమి కొట్టడానికి కీలక పాత్ర పోషించిన ఉద్యమనేత .
బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా భారత స్వాతంత్ర ఉద్యమంలో కీలక వ్యక్తిగా ఉన్న భారతీయ జాతీయ వాద నాయకుడు, గిరిజన యువత గిరిజన హక్కులు చట్టాలు కాపాడుకోవాలంటే భవిష్యత్తులో స్వర్గీయ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆదర్శంగా నడవలికలు స్ఫూర్తి నేర్చుకోవాలని, ఈ సందర్భంగా చిన్న స్వామి యువతకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏపీ కాంగ్రెస్ పార్టీ ఆదివాసి కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ తెలగంజి సోమేశ్వరరావు, మండల అధ్యక్షుడు పాంగి గంగాధర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తడబారికి భీమరావు, కోర్ర మిత్తుల, పాచిపెంట మాలతి, పాచిపెంట ధనలక్ష్మి , నాయకులు, కార్యకర్తలు గిరిజనులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App