TRINETHRAM NEWS

అశేష జనసందోహంతో కనివిని ఎరుగని రీతిలో లోక నాయకుని జన్మదిన వేడుకలు.

అల్లూరి సీతారామరాజు జిల్ల,త్రినేత్రం న్యూస్, జనవరి 24.

అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం పాతకోట పంచాయతీ పనసపుట్టు గ్రామంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు రాష్ట్ర జీసీసీ చైర్మన్_ కిడారి శ్రావణ్ కుమార్,ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది.ఈ సందర్బంగా కేక్ కట్ చేసి, ఉచిత వైద్య శిభిరం ఏర్పాటు చేసి, వృద్ధులకు చీరలు పంపిణి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అనంతరం రాష్ట్ర జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్. మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర ప్రగతి కోసం అలుపెరుగని పోరాటం చేసిన గొప్ప యువనాయకుడు తాతకు తగ్గ మనవడని తండ్రికి తగ్గ తనయుడు నారా లోకేషన్నా అని, యువగళం పాదయాత్ర చేపట్టి ప్రజలతో మమేకం కావడంలో తనదైన పంథాను లోకేష్, చూపారన్నారు. ప్రజా సమస్యలు చూస్తూ, రాజకీయ ఒత్తిళ్లతో సామాన్యులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో 226రోజులు పాటు 3132 కిలోమీటర్ల పాదయాత్ర చేసి స్వయంగా తెలుసుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వం యువగళం పాదయాత్రలో పెట్టిన,ఇబ్బందులను సైతం అదిగమించి తాతకు తగ్గ మనవడిగా తండ్రికి తగ్గ తనయుడిగా, అఖిలాంధ్ర ప్రజల అభిమానాన్ని చూరగొని, ప్రజాసేవకై అనునిత్యం అంకితభావంతో పనిచేస్తున్న యువనాయకుడన్నారు.
ఐటీ అభివృద్ధికి నాడు చంద్రబాబు ఎంతో కృషి చేశారని, నేడు స్కిల్‌, ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. అన్ని రంగాల్లో చంద్రబాబే మనకు స్ఫూర్తి అని,చంద్రబాబు గొప్ప విజనరీ నాయకుడు అని కొనియాడారు. చంద్రబాబు హయాంలోనే ఏపీ అభివృద్ధి చెందుతుందని ఉద్ఘాటించారు. గత 5 ఏళ్లు చీకట్లో మగ్గిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మళ్లీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ నేతృత్వంలో శుభసూచికలు కనిపిస్తున్నాయన్నారు. లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని రాష్ట్ర జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర టూరిజం డైరెక్టర్ కిల్లు వెంకట రమేష్ నాయుడు, రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి కొట్టగూల్లి సుబ్బారావు,టీడీపీ సీనియర్ నాయకులు శెట్టి లక్ష్మణుడు,మండల అధ్యక్షులు కొర్ర తులసిరావు, ప్రధాన కార్యదర్శి సూర్యకాంతం, బాకురీ సర్పంచ్ బాకూరు వెంకటరమణ రాజు, మాజీ జడ్పీటీసీ సాగర సుబ్బారావు, దారెలా సర్పంచ్ పాంగి పాండురంగ స్వామి మాజీ సర్పంచ్ పెల్లమల రామలింగం, అందిభ సర్పంచ్ తామర్ల సత్యనారాయణ,శోభకోట సర్పంచ్ శశి భూషణ్ నాయుడు,ఎంపీటీసీ కొమ్మ రమ, పద్మపురం ఎంపీటీసీ కిల్లో సాయిరామ్,మాజీ వైస్ ఎంపీపీ పొద్దు అమ్మన్న గూడ సర్పంచ్ జ్ఞాన ప్రకాష్,టీడీపీ మహిళా నాయకులు సాగర సత్యవతి, పెనుమల నిర్మల ద్రౌపతి, టీడీపీ నాయకులు భాస్క్తిబారికి రవి,బాబురావు, త్రినాధ్ మురళి సాగర్, సుమన్, రాంబాబు, శ్యామ్ బిడ్డ లక్ష్మణ్, మాజీ సర్పంచ్ కొర్ర వాసుదేవారావు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App