24 న ఎన్ హెచ్ ఎం ఆల్ డాటా ఎంట్రీ ఆపరేటర్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం
హైదరాబాద్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ఏఐటీయూసీ రాష్ట్ర కార్యాలయంలో హిమైత్ నగర్ హైదరాబాదులో ఆల్ డాటా ఎంట్రీ ఆపరేటర్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం ఉదయం 11 గంటల 30 నిమిషాలకు ఆల్ డాటా ఎంట్రీ ఆపరేటర్లతో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించనున్నట్టు జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం.నరసింహ, ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్.
బాలసుబ్రమణ్యం మరియు ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా ఒక ప్రకటనలో వారు తెలియజేశారు.జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్. ఈ సమావేశానికి 33 జిల్లాలలో పనిచేస్తున్న ఆల్ డాటా ఎంట్రీ ఆపరేటర్స్ జిల్లాకు ముగ్గురు చొప్పున హాజరై విజయవంతం చేయాలని కోరారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App