ఎన్.హెచ్.ఎం. రాష్ట్ర యూనియన్ క్యాలెండర్ 2025 ఆవిష్కరణ చేసిన హైదరాబాద్ డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్.వెంకట్
హైదారాబాద్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి 21 జనవరి 2025
ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ క్యాలెండర్ -2025 ఆవిష్కరణలో డి ఎం హెచ్ ఓ డాక్టర్. వెంకట్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది.నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) లో గత 25 సంవత్సరాలుగా దాదాపు 17 వేల మంది ఉద్యోగులు వివిధ కేటగిరి లో కాంట్రాక్టు ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు వీరికి ప్రభుత్వ ఉద్యోగుల బేసిక్ వేతనం కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ ఇవ్వవలసి ఉన్నప్పటికీ దానిని గతంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని భవిష్యత్తులో వీరికి సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఎన్.హెచ్.ఎం. కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సారంగుల బలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఎన్ హెచ్ ఎం కాంట్రాక్టు సిబ్బందికి జరిగిన అన్యాయం పై గతంలో అనేక పోరాటాలు నిర్వహించటం ద్వారా వారి సమస్యల పరిష్కారానికి ఒక కమిటీ వేసి సమస్యలను పరిష్కరిస్తామని గతంలో ఉన్నటువంటి అధికారులు తెలియజేశారని ప్రస్తుతం ఎన్. హెచ్.ఎం. కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారి సమస్యలపై దృష్టి సారించి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వారి సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పట ఇప్పటికే 14 నెలలు గడుస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర నాయకులతో సమస్యల పై చర్చించి పరిష్కారం చేయాలని ఈ సభ ముఖంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనియన్ జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సారంగుల బాలసుబ్రహ్మణ్యం , శ్రీమణి, శ్రీలక్ష్మి ,భార్గవి, రవి కుమార్, వసిం, ప్రకాష్, ఖలీల్, ఖాఫీల్, భార్గవ్ తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App