మల్లన్నపేట గ్రామంలో PACS ఏర్పాటు చేయాలనీ విప్ లక్ష్మణ్ కుమార్ వినతి పత్రాన్ని అందజేసిన నాయకులు
గొల్లపెల్లి మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
గొల్లపెల్లి మండలం మల్లన్నపేట గ్రామంలో పాక్స్ సోసైటీని ఏర్పాటు చేయాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు మంగళవారం రోజున ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కలిసి వినతి పత్రాన్ని అందజేశారు
మల్లన్న పేట గ్రామం లో సొసైటీ ని ఏర్పాటు చేయడం వలన చుట్టూ ప్రక్కల గ్రామలైన వెంగలాపూర్,శంకర్ రావు పేట్, ఇస్రాజ్ పల్లి, రాపల్లి, నందిపల్లి,ఇబ్రహీంనగర్, బి.బి.రాజ్ పల్లి గ్రామాలకు కేవలం రెండు కిలోమీటర్ల దూరం పరిదిలో ఉండడం వలన ఈ గ్రామాల రైతులకు లబ్ధి చేకూరుతుందని కావున మలన్న పేట్ గ్రామన్ని నూతన సహకార సంఘం ఏర్పాటు చేయగలరని విప్ లక్ష్మణ్ కుమార్ కలిసి విన్నవించారు
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App