TRINETHRAM NEWS

నిజమైన లబ్ధిదారులు కె పథకాలు అందుతాయి అన్న అధికారులు

జనవరి21(త్రినేత్రంన్యూస్ ) ధర్మసాగర్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇల్లు ,రేషన్ కార్డులు ,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాల అమలుకు లబ్ధిదారుల ఎంపిక కోసం నేటి నుండి 4 రోజుల పాటు ఏర్పాటు చేయనున్న గ్రామ సభలలో భాగంగా ఈ రోజు ధర్మసాగర్ గ్రామ పంచాయతీ ఆవరణలో సభ ఏర్పాటు చేసారు ఈ కార్యక్రమం లో ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి వినయ కృష్ణ రెడ్డి ఐ ఏ స్ ఆర్ డి ఓ రాథోడ్ రమేష్ తహసీల్దార్ సదానందం మండల అధికారులు గ్రామ పంచాయతీ అధికారులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఈ సభ లో ప్రధమంగా మండల వ్యవసాయ అధికారి దివ్య మాట్లాతు ధర్మసాగర్ గ్రామం లో 22 ఎకరాలు వ్యవసాయం చేయని భూమి కీ రైతు భరోసా నుండి తోగిచాము అని రైతుల పేర్లు తెలిపారు ఈ విషయం పై అభ్యoత్రాలు ఉంటే తెలుపలని అన్నారు తహసీల్దార్ సదానందం మాట్లాడుతూ కొత్త రేషన్ కార్డులా లబ్ధిదారుల జాబితా సిద్ధం చేసాము అని రేషన్ కార్డు లో కుటుంబ సభ్యులు చేర్చడం జరుగుతుంది అని ఆత్మీయ భరోసా జాబితా పై నుండి వచ్చిన జాబితా మరియు ఇందిరమ్మ ఇండ్లు దరఖాస్తు చేసుకున్న

వారి సర్వే పూర్తి చేసి లబ్దిదారుల పేర్లను సిద్ధం చేశామని తెలిపారు గ్రామ పంచాయతీ కార్యదర్శి రమేష్ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితా వివరించారు పేర్లు విన్న తరువాత గ్రామస్తులు తీవ్ర అసంతృప్తి తెలిపారు మా ఇంటి వచ్చి సర్వే చేసి ఫొటోస్ తీసి మరి అర్హులం మైన మా పేర్లు జాబితా లో చేర్చ లేదని ఆవేదన వెక్తం చేశారు ఇకనైనా లబ్ధిదారులు గుర్తించి ప్రవశ పెట్టిన పథకాలను అర్హులకు అందె విధంగా చూడాలని కోరారు ధర్మసాగర్ తహసీల్దార్ మాట్లాడుతూ మీ అభిప్రాయాలు గ్రామ పంచాయతీ మరియు తహసీల్దార్ కార్యాలయం లో తెలపాలి అని మరల సర్వే చేసి తుది జాబితా సిద్ధం చేస్తామని తెలిపారు ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ అని సరియైన లబ్ధిదారులు ఎంపిక చేశాకే మంజూరు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుర్రపు ప్రసాద్ సీనియర్ నాయకులు బొడ్డు లెన్నిన్ జాలిగాపు దుర్గయ్య బొడ్డు కుమార్ కొట్టె యాదగిరి ఇందిరమ్మ కమిటీ సభ్యులు ముఖ్య నాయకులు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App