TRINETHRAM NEWS

ఆంధ్రప్రదేశ్ లో డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు చేయండి!

మాస్టర్ కార్డ్ ఫౌండర్ ప్రెసిడెంట్ రాజమన్నార్ తో లోకేష్ భేటీ!

Trinethram News : దావోస్: మాస్టర్ కార్డ్ హెల్త్ కేర్ బిజినెస్ ఫౌండర్ ప్రెసిడెంట్, మార్కెటింగ్ ఛీఫ్ రాజమన్నార్ తో రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ బెల్వెడేర్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే ఉన్న టాలెంట్ పూల్ ను దృష్టిలో ఉంచుకొని ఎపిలో డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు చేయండి, దీనిద్వారా దక్షిణాదిలో మాస్టర్ కార్డ్ కార్యకలాపాలను విస్తరించే అవకాశం ఉందన్నారు. మాస్టర్ కార్డ్ కంపెనీ ప్రాధాన్యత అయిన ఫిన్ టెక్ కు అనుగుణంగా ఎపిలో ఐటి వర్క్ ఫోర్స్ ను తయారుచేయడానికి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని కోరారు. మాస్టర్ కార్డు హెల్త్ కేర్ మార్కెటింగ్ ఛీఫ్ రాజమన్నార్ మాట్లాడుతూ… మాస్టర్ కార్డ్ సంస్థ 2024లో పూణేలో అత్యాధునిక టెక్ హబ్ ను ప్రారంభించిందని, అక్కడ 6వేల మంది సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారని తెలిపారు.

సురక్షితమైన ఆన్‌లైన్ లావాదేవీల కోసం బయోమెట్రిక్ ప్రామాణీకరణతో సాంప్రదాయ వన్-టైమ్ పాస్‌వర్డ్‌లను భర్తీ చేస్తూ భారతదేశంలో పాస్‌కీ చెల్లింపు సేవలను ప్రారంభించినట్లు చెప్పారు. ప్రస్తుతం తమ కంపెనీకి కంపెనీకి ముంబై, హర్యానా, పూణే, వడోదరలో కార్యాలయాలు ఉన్నాయని అన్నారు. మాస్టర్‌కార్డ్ వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి రంగాల్లో భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా 1 బిలియన్ కొత్త వినియోగదారులు చేర్చడంతోపాటు, 50 మిలియన్ వ్యాపారాలను డిజిటల్‌గా శక్తివంతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. భారత్ లో పెరుగుతున్న క్రెడిట్ అవకాశాలను ఉపయోగించుకొని, భాగస్వాములతో కలిసి సేవలను విస్తరించేందుకు మాస్తర్ కార్డ్ ప్రణాళికలు రూపొందిస్తోందని తెలిపారు. తమ బోర్డు సభ్యులతో చర్చించి, ఎపిలో కార్యకలాపాల విస్తరణపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App