TRINETHRAM NEWS

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ చెత్త డంపింగ్ యార్డ్ కోసం

మేడిపల్లి గ్రామ శివారులో స్థల ప్రతిపాదనను విరమించుకోవాలని కోరుతూ గతంలో

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

జిల్లా కలెక్టర్ జిల్లా అడిషనల్ కలెక్టర్ ఆర్ జి వన్ జీఎం కలిసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది, చుట్టుపక్కల గ్రామాల ప్రజల పరిస్థితిని అధికారులకు వివరించగా, మరొక చోట స్థలం కేటాయిస్తామని హామీ ఇవ్వగా, కానీ మున్సిపల్ అధికారులు మాకు ఇక్కడే సింగరేణి యాజమాన్యం స్థలం కేటాయించిందని, భూమిని చదును చేయడం ప్రారంభించగా, మేము మూడు నాలుగు సార్లు అడ్డుకోవడం జరుగుతుంది.
ఈరోజు మూడవ డివిజన్ కార్పొరేటర్ కుమ్మరి శ్రీనివాస్ ఐదవ డివిజన్ కార్పొరేటర్ కలవచర్ల కృష్ణవేణి పర్యావరణ సామాజిక కార్యకర్త ఉమా మహేశ్వర్ మరియు గ్రామ ప్రజలతో కలిసి డంపింగ్ యార్డ్ కోసం స్థలం దగ్గరికి వెళ్లి, ఈ సందర్భంగా మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ వలన చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అనారోగ్య సమస్యలు కాలుష్యం పెరగడం చుట్టుపక్కల రైతుల పొలాల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని డంపింగ్ యార్డ్ సల ప్రతిపాదనను బుధవారం లోపు విరమించుకోకపోతే, ఈనెల 23 గురువారం రోజున మూడవ ఐదవ డివిజన్ల పరిధిలోని గ్రామాల ప్రజలతో ఆర్జి వన్ జిఎం ఆఫీసును ముట్టడిస్తామని చెప్పారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App