TRINETHRAM NEWS

ధర్మపురి లో అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ TUFlDC గడ్డం వంశీ కృష్ణ

ధర్మపురి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ధర్మపురి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీ కృష్ణ మరియు ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్షణ్ కుమార్ కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీ కృష్ణ మాట్లాడుతూ, దాదాపు 15 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఆయన అన్నారు
బిఆర్ఎస్ వారు అప్పుల తెలంగాణను చేసినప్పటికీ, ఆ అప్పులు తీర్చుకుంటూనే అభివృద్ధి పనులను ఆపకుండా కొనసాగిస్తున్నాం. అభివృద్ధి పథంలో ప్రజలను ముందుకు నడిపించేందుకు కట్టుబడి ఉన్నాం అదేవిధంగా నా ఎంపీ లాండ్స్ నుండి తమ లక్ష్మి నరసింహ స్వామీ వారి గుడి అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తానని తెలిపారు ..

ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్షణ్ కుమార్ మాట్లాడుతూ, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో అనేక మంది కార్యకర్తలు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు సీసీ రోడ్ల డ్రైనేజ్ వ్యవస్థలు ఇతర మౌలిక సదుపాయాల పనులు త్వరలో ప్రారంభమవుతాయని పేర్కొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App