TRINETHRAM NEWS

కార్మిక హక్కుల రక్షణకై పోరాడుదాం కొత్త లేబర్ చట్టాల రద్దుకై ఉద్యమిద్దాం.

పాత పనివేళలను న్టీపీసీ యాజమాన్యం కొనసాగించాలి.

TUCI తెలంగాణ రాష్ట్ర నాయకులు తోకల రమేష్

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖని కార్యాలయంలో ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా TUCI పెద్దపెల్లి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది
ఈ సమావేశానికి TUCI తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు తోకల రమేష్ హాజరై మాట్లాడుతూ* మోడీ ప్రభుత్వం పోరాడి సాధించుకున్న హక్కులపై దాడిని కొనసాగిస్తున్నది 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్ లుగా మార్చి నిర్బంధంగా అమలకు పూనుకుంటున్నది. కార్పొరేట్ శక్తులకు అనుగుణంగా కార్మిక చట్టాలను రూపొందించి కార్మిక వర్గాన్ని బానిసలుగా తయారు చేసేందుకు కుటీల ప్రయత్నాలను కొనసాగిస్తున్నది. ఈ విధానాలను కార్మిక వర్గం ప్రకటించకపోతే పెను ప్రమాదం తప్పదు. కార్మిక వర్గం ఐక్యంగా లేబర్ చట్టాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉన్నది.
న్టీపీసీ యాజమాన్యం దొడ్డి దారిన నూతన కార్మిక చట్టాలను అమలు చేసేందుకు తెగ ఉత్సాహాన్ని చూపుతున్నది. కార్మికుల పని వేళలను మార్చాలని కాంట్రాక్టర్లకు నోటీసులు ఇచ్చింది. ఇది కార్మిక వర్గ హక్కులపై దాడిగానే చూడాలి. 8 గంటల పని విధానాన్ని రద్దు చేసే కుట్రలో భాగంగా పని వేళలు మార్చి 12 గంటల పని విధానాన్ని ప్రవేశపెట్టే కుట్రలో భాగంగా ఎన్టిపిసి యాజమాన్యం నోటీసులు ఇచ్చింది. వెంటనే కాంట్రాక్టర్లకు ఇచ్చిన నోటీసులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. పాత పనివేళలో యధావిడిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం లేనట్లయితే ప్రతిఘటన తప్పదని తెలియజేస్తున్నాం.
ఇంకా ఈ సమావేశంలో ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా తూచ్ పెద్దపెల్లి జిల్లా నాయకులు ఆడెపు శంకర్, గూడూరి వైకుంఠం, గొల్లపల్లి చంద్రయ్య, మారుతి రాములు, కలవల రాయమల్లు, తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App