ఈనెల 18న ఏపి పర్యటనకు అమిత్ షా
Trinethram News : Andhra Pradesh : కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు. కృష్ణా జిల్లా, గన్నవరం సమీపంలో నిర్మించిన ఎన్డీఆర్ఎఫ్ (NDRF), ఎన్ఐడీఎం (NIDM) ప్రాంగణాలను కేంద్ర హోంమంత్రి ప్రారంభించనున్నారు.
శనివారం రాత్రి ఢిల్లీ నుంచి గన్నవరానికి వస్తారు. ఆ రోజు రాత్రి ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో అమిత్ షాకు విందు ఏర్పాటు చేశారు. అనంతరం విజయవాడలోని హోటల్లో బస చేస్తారు.
19న ఉదయం ఎన్ఐడీఎం కేంద్రం, ఎన్డీఆర్ఎఫ్ పదో బెటాలియన్‌ను ఆయన ప్రారంభిస్తారు.
ప్రారంభోత్సవం తర్వాత అమిత్ షా బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.