TRINETHRAM NEWS

ఏపీకి కొత్త పరిశ్రమలు క్యూ కడుతున్నాయి : మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Trinethram News : Andhra Pradesh : కూటమి ప్రభుత్వం ఏర్పడిన 8 నెలల్లోనే సంక్షేమం, అభివృద్ధిలో ఏపీ ముందుకు దూసుకెళ్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.నాయుడుపేటలో ఇవాళ(గురువారం) మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ… మరో రెండు నెలల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలవుతుందని చెప్పారు.

మహిళలకు మూడు సిలిండర్లు, 64 లక్షల మందికి 30వ తేదీన పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు.వెనక్కి వెళ్లిన పరిశ్రమలన్నీ తిరిగి మళ్లీ రాష్ట్రానికి వస్తున్నాయి..కొత్త పరిశ్రమలు క్యూ కడుతున్నాయని అన్నారు. శ్రీ సిటీని అభివృద్ధి చేసి ఉద్యోగ అవకాశాలు మెండుగా కల్పిస్తామని హామీ ఇచ్చారు. సూళ్లూరుపేట నియోజకవర్గానికి రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ సంబంధించి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App