TRINETHRAM NEWS

పెనుముర్లు పులిగుంటి శ్వర తిరునాళ్ళు.
త్రినేత్రం న్యూస్ పెనుమూరు పెనుమూరు ఇంచార్జ్.
గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలం గుంటుపల్లి దగ్గరలో శ్రీ స్వయంభూ పులి గుండీశ్వర దేవాలయం దేవాలయం వెలసి ఉంది. ఈ సంక్రాంతి పండుగ నాలుగో రోజు అయిన ముక్కనుమ రోజు చుట్టుపక్కల గ్రామస్తులందరూ పులిగుంటి శ్వర తిరునాళ్లకు రావడం ఆనవాయతి. ఈ కొండ చూడటానికి ఒకటిగా ఉన్నా దగ్గరగా చూస్తే రెండు కొండలుగా ఉంటాయి. ఈ కొండలు చాలా ఎత్తుగా ఉంటాయి. కొండపైన అయ్యప్ప స్వామి దేవాలయము వెలసి ఉంది. కొండ కింద ఈశ్వర స్వామి దేవాలయం ఉంది పూజారులు తెల్లవారుజామున అభిషేకం చేసి అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు పులిగుండు తిరుణాల చూడటానికి చుట్టుపక్కల దాదాపు 44 గ్రామాల ప్రజలు పాల్గొని తిరుణాలను చూసి తరిస్తారు. కొండపైకి పోవటానికి దారి ఏర్పరిచి ఉన్నారు. ఈ కొండ సుమారు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఏర్పడిందని పెద్దలు చెప్తుంటారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App