తేదీ : 11/01/2025.
అభివృద్ధి చేయండి దేవాలయాన్ని.
విస్సన్నపేట : ( త్రినేత్రం న్యూస్) ; విలేఖరి;
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజవర్గం , పుట్రేల గ్రామపంచాయతీ వీరరాఘవపురంలో ఉన్న శ్రీ సీతారామాంజనేయ ఆలయం పురాతనమైనది. భక్తులు హనుమాన్ శాలీషా సందర్భంగా భక్తులు భజన కార్యక్రమం చేయడం జరిగింది.
పులిహార, ప్రసాదం , అరటి పండ్లు , అక్కడికి వచ్చిన భక్తులు స్వీకరించారు. అక్కడ ఉన్న రైతులు గుడిని పట్టించుకునే పరిస్థితులో లేరు. ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా జీవితాన్ని గడుపుతున్నారు. కానీ రోడ్డు పక్కన దిగువ బాగాన ఉండడంవల్ల గుడి అభివృద్ధి అనేది జరగడం లేదని ప్రజల యొక్క అభిప్రాయం. గ్రామంలో ఉన్న ప్రజలు ఆలయ అభివృద్ధిని కోరడం జరిగింది. ఆలయ చైర్మన్ మొరంపుడి.
జగదీశ్వరరావు మాట్లాడుతూ వారం వారం ఈ గుడిలో పూజలు భక్తులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గత ప్రభుత్వం లో వైయస్సార్సీపి ఏమి పట్టించుకోలేదని చెప్పడం జరిగింది. రైతులు ఆర్థికంగా వెనుక బడడం వలన గుడి అభివృద్ధి జరగలేదని తెలిపారు. దయచేసి ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఈ గుడిని గుర్తించి ,అభివృద్ధి కోసం సహాయ సహకారాలు అందించాలని , రైతులు మరియు ప్రజలు కోరుకుంటున్నారు. అదేవిధంగా విరాళాలు ఇచ్చే దాతలు ముందుకు రావాలని కోరడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App