TRINETHRAM NEWS

పరిగి అభివృద్ధి పనులకు సకాలంలో పూర్తి చేయాలి ముకుంద నాగేశ్వర్

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ ప్రభుత్వం పరిగి అభివృద్ధికి శిలాఫలకాలు శంకుస్థాపనల ఆర్భాటాలే కాకుండాసకాలంలో పనులు పూర్తి చేస్తే బాగుంటుంది.
చేవెళ్లలో 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జిల్లా మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేసిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కాలేశ్వరమై ఉత్తర తెలంగాణకు కొంతవరకు నీళ్లు ఇచ్చినా పూర్వ రంగారెడ్డి జిల్లాకు, పరిగికి మాత్రం నీళ్ళు ఇవ్వడానికి ఇప్పటివరకు ఎటువంటిపనులను ప్రారంభించలేదు.
2015లో అప్పటి ముఖ్యమంత్రివర్యులు కె చంద్రశేఖర రావు పాలమూరు రంగారెడ్డిఎత్తిపోతల పనులను పాలమూరులో ప్రారంభించినా లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్, ఇతర కాలువల పనులు పరిగి నియోజకవర్గంలో ఇప్పటికీ ప్రారంభం కాలేదు పరిగిలో 2015లో అప్పటి మంత్రివర్యులు ప్రస్తుత శాసన మండలి విప్ మహేందర్ రెడ్డి శంకుస్థాపన చేసిన రైతుబజార్ పనులు ఇప్పటికీ ప్రారంభించలేదు.
2015లో అప్పటి మరియు ప్రస్తుత మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేసిన ఆరు నెలలలో పూర్తి కావాల్సిన రాఘవపూర్- నంచర్ల రహదారి పనులు పూర్తి కావడానికి సుమారుగా 8 సంవత్సరాలు పట్టడం పాలకుల అలసత్వానికి నిదర్శనం 2018లో అప్పటి మంత్రివర్యులు హరీష్ రావు శంకుస్థాపన చేసిన లక్నాపూర్ ప్రాజెక్టు సుందరీకరణ పూడికతీత పనులు ఇప్పటికీ సంపూర్ణంగా పూర్తి కాలేదు పరిగిలో 2022లో అప్పటి మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేసిన మోడల్ రైతు వెజ్ నాన్ వెజ్ మార్కెట్ పనులు అసంపూర్తిగానే నిలిచిపోయాయి*
పరిగి ప్రజలకు అవసరమైన ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనం, బీసీ, మైనారిటీ గురుకులాల భవనాలు, ఇంటిగ్రేటెడ్ గురుకుల భవనాలుఇప్పటికీ శంకుస్థాపనకు కూడానోచుకోలేదు సుమారుగా 20 లక్షల ఎకరాలకు పైగా నీరు అందుతున్న ఉమ్మడి నల్గొండ జిల్లాకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ఏదుల నుండి నీళ్లు తీసుకెళ్ల డానికి మంత్రివర్గం ఆమోదం తెలపడం నిధులు కేటాయించడం పూర్వ రంగారెడ్డి జిల్లాలో కృష్ణా నది నుండి ఇప్పటికీ ఒక్క ఎకరాకు కూడా నీరు ఇవ్వనప్పటికీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు పరిగి నియోజకవర్గంలో లక్ష్మీదేవి పల్లి దగ్గర ఇప్పటికీ ప్రారంభించక పోవడం ప్రభుత్వ పెద్దలకు పూర్వ రంగారెడ్డి జిల్లా పై ఉన్న వివక్షత స్పష్టంగా కనబడుతుంది.
ఏ పార్టీ ప్రభుత్వం అయినా ప్రజల పన్నులతో చేస్తున్న అభివృద్ధి పనులలో అలసత్వం, ప్రజాధనం దుర్వినియోగం, నిధుల కేటాయింపులో కొన్ని ప్రాంతాలపై వివక్ష చూపడం ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదు.ముకుంద నాగేశ్వర్, టీజేఏసీ చైర్మన్,

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App