TRINETHRAM NEWS

రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మృతి

వరంగల్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

వరంగల్ జిల్లా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మట్టెవాడలో రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిని వాహనంతో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్కు తీవ్ర గాయాలు అయ్యాయి. అనంతరం డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనతో స్థానికులు ఆందోళనకు చెంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న కానిస్టేబుల్ని ఆస్పత్రికి తరలించారు. కానిస్టేబుల్‌ పరిస్థితి విషమించటంతో అతడు మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ శ్రీరామ్‌రాజుగా గుర్తించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App