రామగుండం నియోజకవర్గం మాదిగ కళా నాయకుల సన్నాహక సమావేశం
లక్ష డప్పులు, వెయ్యి గొంతులతో భారీ ప్రదర్శన
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పులుపు మేరకు, వెయ్యి గొంతులు లక్ష డప్పులు మహా కళా ప్రదర్శన నిర్వహణ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఏపూరి సోమన్న నేతృత్వంలో ఫిబ్రవరి 7 తారీకు నాడు జరగబోయే వెయ్యి గొంతులు లక్ష డప్పులు మహా కళా ప్రదర్శన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం..
హక్కుల కోసం మొదటిసారి డప్పులు కొడుతున్నం
జనవరి 7 నుంచి కళానాయకుల కవాతు
మాదిగలంతా పాల్గొని విజయవంతం చేయాలి
-ప్రజా గాయకుడు రామంచ భరత్.
ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా ఎమ్మార్పీఎస్ జెండా పట్టుకుని మందకృష్ణ మాదిగ పోరాడు తున్నారని, వారు చేపట్టిన మాదిగ కళా నాయకుల కవాతుకు మద్దతుగా మాదిగలంతా సహకరించాలని వార్డు మెంబర్ నుండి పార్లమెంటు సభ్యుని వరకు అటెండర్ నుండి ఐఏఎస్ ఆఫీసర్ వరకు మనిషికో డప్పు కొనుక్కొని వెయ్యి గొంతులు లక్ష డబ్బులు మహా కళా ప్రదర్శనలు విజయవంతం చేయాలని మాజీ శాసనసభ్యులు కాసిపేట లింగయ్య పిలుపునిచ్చారు.
ఈ మేరకు రామగుండం నియోజకవర్గానికి సంబంధించిన కళానాయకుల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాట్లాడుతూ దేశంలో అన్ని వర్గాల ప్రజలు వర్గీకరణకు మద్దతు తెలియజేసాయని అన్నారు.
ఎస్సీలలో ఉన్న 59 కులాల్లో కేవలం ఒక కులం మాత్రమే వ్యతిరేకంగా ఉందని అన్నారు. అన్ని ఉద్యమాల్లో, రాజకీయ పార్టీల గెలుపు ఓటములలో మాదిగ కళాకారుల పాత్ర ఉందని అన్నారు. ఎన్నో మంచి చెడులలో, ఎందరికో డప్పు కొట్టి పాట పాడామని, ఇప్పుడు మొట్టమొదటిసారిగా తమ హక్కుల సాధన కోసం డప్పులు కొట్టబోతున్నామన్నారు. జనవరి 7 నుంచి ఫిబ్రవరి 7 వరకు లక్ష డప్పులు వెయ్యి గొంతుల కళానాయకుల కవాతు కార్యక్రమాన్ని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రారంభించనున్నారని రామంచ భరత్ తెలిపారు.
ఎమ్మెస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఇంజం వెంకటస్వామి మాట్లాడుతూ ఈ కవాతు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు, మాదిగ మేధావులు, ఉద్యోగులైన జాతి బిడ్డలను గౌరవించుకుంటూ వారిని సన్మానం చేస్తామని అన్నారు. అలాగే అమరులైన మాదిగ అమరవీరులకు నివాళులు అర్పించడం జరుగుతుందన్నారు. రామగుండం నియోజకవర్గం ఇన్చార్జి రేణిగుంట్ల సాగర్ మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గీకరణ చేస్తానని హామీ ఇవ్వడంతో బలమైన ఆకాంక్షను తెలియజేసేందుకు మొదటిసారి తమ హక్కుల కోసం డప్పు కొట్టబోతున్నట్లు తెలిపారు. అందుకోసం ఈ కార్యక్రమంలో నియోజకవర్గం పరిధిలోని మాదిగలు, మాదిగ ఉపకులాల కళానాయకులంతా విధిగా పాల్గొనాలని తెలిపారు.
వెయ్యి గొంతులు లక్ష డప్పులు మహా కళా ప్రదర్శన కమిటీ రామగుండం నియోజకవర్గం అధ్యక్షులు గాజుల రమేష్ ఉపాధ్యక్షులు దూడపాక సతీష్ పులిపాక దేవేందర్ పొయ్యిల రాజు ప్రధాన కార్యదర్శిగా చిలుముల వెంకటస్వామి ప్రచార కార్యదర్శి బెజ్జల రమేష్. పట్ల రత్నం సహాయ కార్యదర్శి చిలుముల ఎల్లయ్య మెరుపేటి మల్లయ్య వాసాల రాజయ్య మేకల శ్రావణి
ఈ కార్యక్రమంలో భరత్ తో పాటు వెయ్యి గొంతులు లక్ష డప్పులు మహాప్రదర్శన నిర్వహణ కమిటీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు ఏటరవి కార్పొరేటర్ పాముకుంట్ల భాస్కర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ రామచంద్రం ఎంఎస్పి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మంతిని చందు టీబీజీకేఎస్ నాయకులు వడ్డేపల్లి శంకర్ అన్న పులిపాక బానేష్ తూండ్ల రాజన్న అరుణోదయ సాంస్కృతిక కళామండలి నాయకులు పల్లె లింగన్న యాకూబ్ అన్న కవులు రచయితలు గాయకులు ప్రజాస్వామికవాదులు మేధావులు పాల్గొని విజయవంతం చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App