నాసిరకం సీసీ రోడ్డు వేసినా కాంట్రాక్టర్ పై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్
వికారాబాద్ జిల్లా దారుర్ మండలం కొండాపూర్ కలాన్ లో ఎంపీ నిధులతో దళిత వాడలో నాసిరక సీసీ రోడ్డు వేసిన కాంట్రాక్టర్ పై చట్ట పరం గా చర్యలు తీసుకోవాలని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ సుదీర్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్బంగా కె వి పి ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలిమల్కయ్య,సిపిఎం మండల కార్యదర్శిసుదర్శన్, నాయకులు జోగు లాలయ్య మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా దారుర్ మండలం కొండాపూర్ కలాన్ లో ఎంపీనిధులతో దళిత వాడాలో నాసిరకంగా సీసీ రోడ్డు వేస్తు నాసిరక సీసీ రోడ్డు ఎందుకు వేస్తున్నావ్ అని అడిగితే గ్రామస్తు లనుబెదిరిస్తున్నాడు.నీకు దమ్ము దర్యం ఉంటే నీకు దిక్కు ఉన్న చోట చెప్పుకో అని బెదిరింపులకి పాల్పడుతున్నారు.తక్షణమే నాసిరకం సీసీ రోడ్డు వేసిన కాంట్రాక్టర్ పై చట్ట పరం అయినా చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App