33వ డివిజన్ లో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు బండి రాము
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ఈరోజు ఉదయం స్థానిక 33వ డివిజన్లో జరిగినటువంటి ఉచిత కంటి వైద్య శిబిర కార్యక్రమాన్ని డివిజన్ ప్రజలు అత్యధికంగా వినియోగించుకోవడం జరిగింది. ఇటువంటి గొప్ప మహాత్కార్యానికి సహకరించినటువంటి లయన్స్ క్లబ్ సభ్యులకు మరియు రేకుర్తి కంటి ఆసుపత్రి సిబ్బందికి 33వ డివిజన్ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదములు తెలిపిన కాంగ్రెస్ నాయకులు బండి రాము కంటి ఆపరేషన్ కొరకు 33వ డివిజన్ నుంచి వచ్చిన సుమారుగా 30 మందికి బస్సును ఏర్పాటు చేసి రేకుర్తి ఆసుపత్రికి పంపారు .ఈ యొక్క కార్యక్రమంలో దాదాపుగా 200మందికి పైగా డివిజన్ ప్రజలు పాల్గొనడం జరిగిందిఈ వైద్య శిబిర కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బండి సాయి,శంకర్, శివ, సాయి తేజ, సంపత్,యశస్వి, వెంకటేష్, మదన్, శ్రీకాంత్, శ్రీనివాస్ పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App