ఖనిలో కంటి వైద్యశిబిరం…. లయన్స్ క్లబ్
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం కార్పొరేషన్ పరిధి 33వ డివిజన్లో లయన్స్ క్లబ్ సహకారంతో మాజీ గవర్నర్ లయన్ డాక్టర్ విజయ జన్మదినం పురస్కరించుకొని డివిజన్ ప్రజలకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. డివిజన్ కు చెందిన బండి రాము ఆధ్వర్యంలో మంగళవారం నిరుపేద ప్రజలకు వైద్య పరీక్షలు, షుగర్,బిపి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కంటి ఆపరేషన్లు అవసరమైన వారిని రేకుర్తి కంటి ఆసుపత్రికి తరలించారు. వారికి ఉచితంగా ఆపరేషన్లు చేసి తిరిగి ఇక్కడికి తీసుకువస్తామని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు పి మల్లికార్జున్, సెక్రెటరీ వి ఎల్లప్ప, జోన్ చైర్మన్ కె రాజేందర్, సీనియర్ లయన్ సభ్యులు మేడిశెట్టి గంగాధర్, బంక రామస్వామి, పోకల ఆంజనేయులు, రేకుర్తి హాస్పిటల్ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App