అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే : పుట్ట మధుకర్
త్రినేత్రం న్యూస్ ముత్తారం మండల ఆర్ సి..
ముత్తారం మండలం కేంద్రంలోని ఓడేడు గ్రామంలో శ్రీపతి ఉమ – జగన్ నివాసంలో అయ్యప్ప స్వామి మహా పడిపూజ మహోత్సవ కార్యక్రమంలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజాలు నిర్వహించిన మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అయ్యప్పస్వామి ఆశీర్వాదంతో మంథని నియోజకవర్గ ప్రజలందరూ సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని.పాడి పంటలతో మంథని ప్రాంతం సుభిక్షంగా ఉండేలా స్వామివారి ఆశీర్వాదం ఉండాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు.ముత్తారం మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పొత్తుపెద్ది కిషన్ రెడ్డి,మాజీ వైస్ ఎంపీపీ సుధాటి రవీందర్ రావు,సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు నూనె కుమార్, ఓడేడు గ్రామం మాజీ సర్పంచ్ ఇల్లందుల అశోక్,ఓడేడు గ్రామ శాఖ అధ్యక్షులు నరెడ్ల రమేష్, ఓడిడి గ్రామ అయ్యప్ప స్వామి భక్తులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App