కీ”శే గడ్డం శైలజ కు ఘననివాళులు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్
తెలంగాణ శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ సతీమణి స్వర్గీయ గడ్డం శైలజ 4వ వర్ధంతిసందర్బంగా వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అర్ధ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వికారాబాద్ రైల్వే స్టేషన్ ముందుగల బాబాసాహెబ్.అంబెడ్కర్ విగ్రహం వద్ద ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం అన్నదాన కార్యాక్రమం నిర్వహించడం జరిగింది. ఇట్టి ఈ కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొని వారి సతీమణి గడ్డం.శైలజ కు పూల మాల తో నివాళులర్పించారు ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ గడ్డం.ప్రసాద్ కుమార్ కుటుంబానికి గడ్డం శైలజ మరణం తీరని లోటు అని వారు జీవించినంత కాలం వికారాబాద్ ప్రజల కోసం ఆలోచించా రని ప్రజలకు సేవలందిస్తున్న గడ్డం ప్రసాద్ కుమార్ కు ఎల్లప్పుడు అండగా ఉన్నారని వారి మరణం కాంగ్రెస్ పార్టీకి కూడా తీరని లోటు అని ఈ సందర్భంగా కొనియాడారు
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చిగుళ్లపల్లి.మంజుల రమేష్ మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు,మార్కెట్ కమిటీ అధ్యక్షులు,కౌన్సిలర్లు ,ప్రజా ప్రతినిధులు నాయకులు మరియు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App