TRINETHRAM NEWS

మృతుల కుటుంబాలను పరామర్శించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

వరంగల్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
తేది:-24-12-2024.

వర్ధన్నపేట మున్సిపల్ ఛైర్మన్ అంగోతు అరుణ బాబాయ్ డిసి తండా గ్రామ మాజీ సర్పంచ్ అంగోతు రవీందర్ ఇటీవల అనారోగ్యంతో మరణించగా నేడు వారి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు

అనంతరం అదే గ్రామానికి చెందిన భూక్యా రాజు, అంగొతు భీకి, భూక్యా గణేష్ లు ఇటీవల అనారోగ్యాలతో మరణించగా నేడు వారి నివాసానికి వెళ్లి వారి కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు

అనంతరం భవాని కుంట తండా కి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు నునావత్ ఖీమా నాయక్ కుమారడు నునావత్ రవి అనారోగ్యంతో మరణించగా నేడు వారి నివాసానికి వెళ్లి ఆయన భౌతిక దేహానికి పూలమాల వేసి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయిల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App