ఏకశిలా పార్క్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పార్క్ సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ కు వినతి
హనుమకొండ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి 23 డిసెంబర్ 2024
హనుమకొండ బాల సముద్రంలోని ఏకశిలా పార్కులో అత్యవసరంగా పరిష్కరించవలసిన ప్రధాన సమస్యలు ఏకశిలా పార్కులో టాయిలెట్ కట్టించి కొంతకాలంగా మున్సిపల్ పరిధిలో మెయింటైన్ చేశారు.కానీ గత 2 సంవత్సరాల నుండి మూతపడి వుంది ఏకశిల పార్కుకు సుమారుగా 2000 మంది రోజువారీగా వాకర్స్ వస్తుంటారు లేకపోవడంతో వాకర్స్ అసౌకర్యంగా ఇబ్బందులకుగురవుతున్నారుఅదేవిధంగా పార్కులో వాకింగ్ ట్రాక్ పై కొన్ని పెద్ద చెట్లు ఎండిపోయి ఉన్నవి వర్షాలు గాలిదుమారాలకు కూలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి వెంటనే వాటిని తొలగించాలని అదేవిధంగా పార్కులు గ్రీనర్ కి కొన్ని లక్షల ఖర్చు చేసి వివిధ రకాల మొక్కలు నాటించారు కానీ వాటికి నీళ్లు పోయకుండా ఉండడం వల్ల అవి ఎండిపోయే పరిస్థితి ఉంది కావున ఒక మాలిని ప్రత్యేక కార్మికున్ని కెటాయించాలని అదేవిధంగా పార్క్ కాంపౌండర్ వాళ్ళు బయటవైపు తూర్పు దిక్కు రోడ్డు ప్రక్కన మున్సిపల్ డస్ట్ ఉన్నందున వాటి దుర్వాసనతో వాకర్స్ ఇబ్బంది పడుతున్నారు పార్కులో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఉండుటకై పార్కులోగా గదిని నిర్మించి వాచ్మెన్ ను నియమించాలని ఎక్కువమంది పరిశుద్ధ కార్మికులను నియమించాలనీ ఏకశిలా పార్క్ వాకర్స్ అసోసియేషన్ హన్మకొండ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు వరంగల్ మహా నగర పాలక సంస్థ కమిషనర్ కు వినతి పత్రం అందజేయడం జరిగింది.
మున్సిపల్ కమిషనర్ స్పందిస్తూ ఏకశిలా పార్కులో సాధ్యం అంతవరకు వినతిలో ఇచ్చిన సమస్యలన్నీ పరిష్కారానికి కృషి చేస్తానని సంబంధిత అధికారి రాధారపు మేనక అసిస్టెంట్ ఇంజనీరింగ్ అధికారికి ఇందులో పేర్కొన్న సమస్యలను పరిష్కరించాలని కమిషనర్ సూచించినారు.
ఈ కార్యక్రమంలో ఏకశిలా పార్క్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వంగ రాజిరెడ్డి, చీప్ అడ్వైజర్ పచ్చిమట్ల ఎల్లా గౌడ్ అధ్యక్షులు చాడ దశరథరామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి పట్నాల సోమయ్య, పి.ఆర్.ఓ, వేల్పుల సారంగపాణి, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App