TRINETHRAM NEWS

నవాబుపేట్ మండల ఆర్ఎంపీ ప్రథమ చికిత్స సెంటర్లపై తనిఖీలు

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్- రెండు ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు సీజ్
మరో రెండు క్లినిక్ లకు హెచ్చరిక
నవాబుపేట్ మండల వైద్యాధికారి డాక్టర్ రోహిత్
వికారాబాద్ జిల్లా నవాబుపేట మండల కేంద్రంలోని ప్రథమ చికిత్స సెంటర్లపై జిల్లా వైద్యాధికారి( డి ఎం హెచ్ ఓ ) ఆదేశాల మేరకు నవాబు పేట్ మండల వైద్య అధికారి డాక్టర్ రోహిత్ ఆకస్మిక తనిఖీలునిర్వహించారు. ఈ సందర్భంగా నవాబుపేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రోహిత్ మాట్లాడుతూ… డి ఎం హెచ్ ఓ ఆదేశాల మేరకు గురువారం మండల కేంద్రంలోని, పరిధిలోని ఆస్పత్రిలను తనిఖీ చేయడం జరిగిందన్నారు. నవాబుపేట్ మండల కేంద్రంలోని మూడు ఆసుపత్రిను తనిఖీ చేయగా అందులో రుక్మిణి ఒకటి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ గా గుర్తించడం జరిగిందన్నారు. ఫస్ట్ ఎయిడ్ సెంటర్లో చేయవలసిన చికిత్స కాకుండా ఒక ఎంబిబిఎస్ డాక్టర్ చేయవలసిన చికిత్స చేయడం ద్వారా రుక్మిణి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ను సీజ్ చేయడం జరిగిందన్నారు. ఎలాంటిఅనుమతులు లేకుండా గ్లూకోజ్ లు రోగులకు ఎక్కించడం, చిన్నపిల్లలకు సైతం చికిత్స అందించడం ఫస్ట్ ఎయిడ్ సెంటర్లో అనుమతులు లేకుండా చేయడం సరే అది కాదని హెచ్చరించడం జరిగిందన్నారు. ఇష్టానుసారంగా గ్లూకోజ్ లు ఎక్కించడం సరి అయింది కాదన్నారు. తనిఖీ సమయంలో వ్యాధిగ్రస్తులకు టాబ్లెట్లు ఇవ్వడానికి కూడా ఫార్మసిస్టు లేకపోవడం ఆర్.ఎం.పి అన్ని చేయడం ద్వారా సీజ్ చేయడం జరిగిందన్నారు.

అలాగే మండల పరిధిలోని ఫుల్ మామిడి గ్రామంలో సుమారు గత ఐదు సంవత్సరాల నుండి ఓ సెటరులో ప్రథమ చికిత్స అందిస్తున్న కుమార్ అనే వ్యక్తి వైద్యం పేరుతో వైద్యం చేస్తుండగా తనిఖీలు అతను పేక్ ఆర్ఎంపీగా గుర్తించి సీజ్ చేయడం జరిగిందన్నారు. కుమార్ అనే వ్యక్తిని వైద్యానికి సంబంధించిన సర్టిఫికెట్ చూపించమని వివరణ అడగగా ఎలాంటి సర్టిఫికెట్ లేవని తెలపడంతో ఫేక్ ఆర్ఎంపీ తేలడంతో ఆ సెంటర్ లో అతనికి పర్మిషన్ లేకుండా నే వైద్యానికి కావలసిన మెడిసిన్ అందులో ఉండటం ద్వారా సీజ్ చేయడం జరిగిందన్నారు. నవాబుపేట్ మండల కేంద్రంలోని మరో రెండు ఆసుపత్రులకు హెచ్చరికచేయడం జరిగిందన్నారు. సర్టిఫికెట్ ఒకరి పేరు మీద ఉంటే మరొకరు వైద్యం అందించడం సరైనది కాదని హెచ్చరించడం జరిగిందన్నారు. వైద్యానికిచేయడానికి కావలసిన సర్టిఫికెట్ ఎవరి పేరు మీద ఉంటే వాళ్లే చేయాలని తెలపడం జరిగిందన్నారు. ఎటువంటి సర్టిఫికెట్ లేని వ్యక్తి వైద్యం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ ఆకస్మిక తనిఖీలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రఫిక్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App