TRINETHRAM NEWS

జర్నలిస్టుల బలం, బలగం టీయూడబ్లూజే (ఐజేయూ)

జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఇరంతర పోరాటం

టీయూడబ్లూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షులు బుర్ర సంపత్ కుమార్

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖని జర్నలిస్టుల బలం, బలగం టీయూడబ్లూజే (ఐజేయూ) అని, జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిరంతర పోరాటం చేస్తామని టీయూడబ్లూజే (ఐజేయూ) రాష్ట్ర ఉపాధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు బుర్ర సంపత్ కుమార్ అన్నారు. ఆదివారం గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో యూనియన్ సభ్యత్వాన్ని ఐజేయూ జాతీయ కౌన్సిల్ మెంబర్ ఎం. వంశీ, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కోల లక్ష్మణ్, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పూదరి కుమార్, ప్రధాన కార్యదర్శి పందిళ్ళ శ్యామ్ సుందర్ లతో కలిసి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆరంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరికొద్ది రోజుల్లో యూనియన్ మూడవ జిల్లా మహాసభను నిర్వహించనున్న సందర్భంగా జిల్లావ్యాప్తంగా సభ్యత నమోదు కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. మహాసభ రోజున జిల్లా నూతన కార్యవర్గాన్ని కి ఎన్నికలు ఉన్నామని తెలిపారు. క్రమశిక్షణ గల సంఘం టీయూడబ్ల్యూజే ఉందని అన్నారు. 40 ఏళ్లుగా జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం, సంక్షేమం కోసం నిరంతరం పోరాటం చేస్తున్న ఏకైక సంఘం అని గుర్తు చేశారు. గత పది సంవత్సరాలుగా జిల్లాలో జర్నలిస్టులకు ఇండ్లు, ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేస్తూనే ఉన్నామని, కానీ ఇప్పటివరకు ఆ సమస్య పరిష్కారం కాలేదని అన్నారు. ఇటీవల పెద్దపల్లి లో జరిగిన యువ వికాసం బహిరంగ సభకు హాజరైన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లాకు చెందిన రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, పెద్దపల్లి, రామగుండం ఎమ్మెల్యేలు చింతకుంట విజయ రమణారావు, రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ కు వినతి పత్రాలు అందజేశామని తెలిపారు. మరికొద్ది రోజులు తమ సమస్యలు పరిష్కారం కోసం వేచి చూస్తామని, ఆలోపు పరిష్కారం కాకపోతే పోరాటం చేయక తప్పదని అన్నారు. ఆ పోరాటానికి జర్నలిస్టులంతా సిద్ధంగా ఉండాలని కోరారు. ఐజేయు జాతీయ కౌన్సిల్ మెంబర్ వంశీ మాట్లాడుతూ ,జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరంగా పోరాటం చేసే యూనియన్ టీయూడబ్లూజే (ఐజేయూ) అని అన్నారు. జర్నలిస్టులకు అండగా నిలుస్తున్నదని తెలిపారు. జర్నలిస్టులంతా ఐక్యంగా ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు సభ్యత్వం తీసుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కోల లక్ష్మణ్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న జర్నలిస్టులకు ఇండ్లు, ఇళ్ల స్థలాల కోసం పదిహేనుగా పోరాటం చేస్తున్నామని, గత ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వమైన ఇండ్లు ఇళ్ల స్థలాలు మంజూరు చేయకుంటే విస్తృత పోరాటం చేస్తామని ఆయన అన్నారు.ఈ సభ్యత నమోదు కార్యక్రమంలో, జిల్లా ఉపాధ్యక్షులు పాలకుర్తి విజయ్ కుమార్, దాడుల నివారణ కమిటీ కన్వీనర్ సిపెల్లిరాజేశం జాయింట్ సెక్రెటరీ జక్కం సత్యనారాయణ, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీలు, కేఎస్ వాస్.సురభి శ్రీధర్, మెంబర్స్ దబ్బెట శంకర్ , కొండల్ రెడ్డితోపాటు, పాత్రికేయులు దయానంద్ గాంధీ, వడ్డేపల్లి దినేష్, సిహెచ్ రాజేష్, మాటేటి శ్రీనివాస్, బొల్లం మధు, మామిడి అశోక్, కే. శంకర్, ఎం. శంకర్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App