TRINETHRAM NEWS

అక్రమ నిర్మాణాలకు ముందుగా అనుమతులిచ్చి.. ఆ తర్వాత కూల్చి వేత నోటీసులిచ్చే అధికారుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం

Trinethram News : Telangana : అక్రమ నిర్మాణాలకు ముందుగా అనుమతులిచ్చి, ఆ తర్వాత కొన్నేళ్లకు కూల్చివేత నోటీసులిచ్చే అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశాలు జారీ చేస్తే కాని సరిగా విధులు నిర్వహించరని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది.

నష్టపరిహారం కూడా సదరు అధికారుల నుంచే వసూలు చేసేలా ఉత్తర్వులు జారీ చేయాల్సిన స్థితి వస్తుందని హెచ్చరించింది.

అధికారుల ఆస్తులు జప్తు చేస్తే అప్పుడు తెలిసి వస్తుందని పేర్కొంది. అక్రమ నిర్మాణాల కూల్చివేత సమయంలో సర్కార్ పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని, అధికారుల తప్పులకు ప్రజాధనం వెచ్చించడం సరికాదని అభిప్రాయపడింది.

నిర్మాణం అక్రమమైనప్పుడు ఆ నిర్మాణం చేపట్టడానికి ఎలా అనుమతులు ఇస్తున్నారని ప్రశ్నించింది. అవకతవకలకు పాల్పడి అనుమతులిచ్చి.. నిర్మాణం పూర్తయిన తర్వాత చెరువులు, బఫర్ జోన్, ఎఫ్టీఎల్ అంటూ కూల్చివేతలకు పాల్పడుతున్నారని మండిపడింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App