వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు పరిశీలన
ప్రకాశం జిల్లా, త్రినేత్రం న్యూస్, త్రిపురాంతకం.. త్రిపురాంతకం మండలంలో ఎండూరు వారి పాలెం, విశ్వనాధపురం, మరియు వెల్లంపల్లి గ్రామాల్లో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా సివిల్ సప్లై మేనేజర్ వరలక్ష్మి, స్థానిక మండల వ్యవసాయ అధికారి నీరజ తో కలిసి దాన్యం కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షించారు. రైతులు ధాన్యం 17% ఉండేలా ఆరబెట్టుకొని కేంద్రాలకు తీసుకొని రావాలని, ధాన్యం కొనుగోలుకు కావలసిన బ్యాగులు, హమాలి చార్జీలు, మరియు రవాణా చార్జీలు పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు .ప్రభుత్వం నిర్దేశించిన కనీసం మద్దతు ధరకు రైతులు ధాన్యాన్ని అమ్ముకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు తెలియజేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App