TRINETHRAM NEWS

వైసీపీకి మాజీ మంత్రి రాజీనామా

Dec 12, 2024,

Trinethram News : ఆంధ్రప్రదేశ్ : వైసీపీకి షాక్ తగిలింది. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ఈ మేరకు అధ్యక్షుడు జగన్ కు రాజీనామా లేఖను పంపినట్లు తెలిపారు. జగన్ హయాంలో అవంతి పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే రాజీనామా ప్రకటన చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆయన చెప్పారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App