పర్యావరణ కార్యకర్తను స్తంభానికి కట్టేసి కొట్టిన ఆక్వా రైతులు
Trinethram News : తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం సన్నవిల్లి గ్రామానికి చెందిన వీర దుర్గాప్రసాద్ అనే యువకుడు ఆక్వా చెరువుల వల్ల నీటి కాలుష్యం అవుతుందని ఫిర్యాదు చేశాడు.
దుర్గాప్రసాద్ ఫిర్యాదుతో కోర్టు కూడా ఆక్వా చెరువుల తవ్వకాలకు ఆపేయాలని ఆదేశాలు ఇచ్చింది.. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ ఆక్వా రైతులు మళ్లీ చెరువులను తవ్వే ప్రయత్నం చేశారు.
దీనిపై ఆధారాలు సేకరించాలని అధికారుల సలహా మేరకు దుర్గాప్రసాద్ ఫొటోలు తీసేందుకు వెళ్లగా.. అతడిని ఆక్వా రైతులు స్తంభానికి కట్టేసి కొట్టారు.
ప్రస్తుతం దుర్గాప్రసాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.. దుర్గాప్రసాద్‌పై దాడి చేసిన నలుగురు వ్యక్తులపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App