TRINETHRAM NEWS

ఐ ఎఫ్ టీ యు.రాష్ట్ర నాయకులు యు.రాములు స్మారక స్తూపాన్ని కూల్చి వేయుటకు చేస్తున్న ప్రయత్నాలు విరమించుకోవాలి!

మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఐ ఎఫ్ టీ యు, సిపిఐ (ఎం ఎల్) న్యూడెమోక్రసీ విజ్ఞప్తి!

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ఐ ఎఫ్ టీ యు రాష్ట్ర నాయకులు అమరుడు కామ్రేడ్ యు రాములు స్మారక స్తూపం గోదావరిఖని మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా గల రోడ్డు పక్కన మార్చి 14, 2004.లో కార్మికులు ప్రజలు తమ అభిమాన నాయకుడికి స్వచ్ఛంద విరాళాలతో స్మారక స్తూపాన్ని నిర్మించుకున్నారు. ఈ ప్రాంతంలో విప్లవ ట్రేడ్ యూనియన్ నిర్మాణంలో కార్మికుల సమస్యలు, హక్కుల కోసం జరిగిన పోరాటాలలో అగ్రభాగాన నిలబడి పోరాడాడు.
గత 20 సంవత్సరాల క్రితం కొంతమంది గుండాలచే హత్య చేయబడ్డాడు కామ్రేడ్ యు రాములు
జ్ఞాపకార్థం ఐ ఎఫ్ టీ యు, సిపిఐ (ఎం ఎల్) న్యూడెమోక్రసీ న్యూ డెమోక్రసీ. జిల్లా కమిటీ స్మారక స్తూపాన్ని నిర్మించింది.
ప్రతి సంవత్సరం కామ్రేడ్ రాములు సేవలను గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పిస్తారు.
గోదావరిఖని అభివృద్ధి పేరిట రోడ్లు వెడల్పు చేస్తూ కామ్రేడ్ యు రాములు స్మారక స్థూపాన్ని కూల్చి వేయుటకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇట్టి ప్రయత్నాల్ని ప్రజలు, కార్మికులు, కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు. ఖండించాల్సిందిగా ఐ ఎఫ్ టీ యు, సిపిఐ (ఎం ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కమిటీ లు విజ్ఞప్తి చేస్తున్నాయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App