డిసెంబర్ 13న చలో అసెంబ్లీకి తరలి రండి : TUCI పిలుపు
సింగరేణిలో ఇంకెంతకాలం కార్మికుల శ్రమ దోపిడి
PSCWU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల రమేష్
సింగరేణి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
RG 2 డివిజన్లోని 8వ కాలనీలోని సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సెక్షన్ల వద్ద చలో అసెంబ్లీ ప్రచారం చేస్తూ గేట్ మీటింగ్ లు నిర్వహించడం జరిగింది ఈ మీటింగ్ లో
ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల రమేష్, TUCI జిల్లా నాయకులు గూడూరు వైకుంఠం, ఆడేపు శంకర్, ఇనుగాల రాజేశ్వర్ పాల్గొని మాట్లాడుతూ సింగరేణి లో కాంట్రాక్ట్ కార్మికులు అత్యంత శ్రమ దోపిడీకి గురి అవుతున్నారు. కార్మిక చట్టాల అమలు అనేది లేకుండా సింగరేణి యాజమాన్యం కాంట్రాక్టు కార్మికులను కట్టుబానిసలుగా చూస్తున్నది. కార్మిక సమస్యలు చెప్పుకునేందుకు రాష్ట్రంలో కార్మిక శాఖ మంత్రి లేని పరిస్థితి ఉన్నది. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకొచ్చి సంవత్సరం పూర్తి చేసుకొని రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నది. మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సూటిగా ప్రశ్నిస్తున్నాం. సింగరేణిలో కాంట్రాక్టు కార్మికుల వేతనాల కొరకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ అవసరం లేదన్నారు. లాభాల్లో వాటా ముఖ్యమంత్రి ప్రకటన చేశారు కానీ సింగరేణి యాజమాన్యం మాత్రమే చెల్లించిందన్నారు. ఇప్పుడు జీతాల పెరుగుదల ప్రకటన చేసిన నోటి మాట సహాయమే ముఖ్యమంత్రి కార్మికులకు ఇచ్చిన మాట నిలబడతది తప్ప రాష్ట్ర ప్రభుత్వం మీద ఈ బడ్జెట్ పడే అవకాశం లేదన్నారు.
వేతనాల పెంపుదల నిర్ణయం
ఈ అసెంబ్లీ సమావేశాలలో తీసుకోవాలని డిమాండ్ చేశారు.13వ తారీకు చలో సింగరేణి పిలుపుకు కాంట్రాక్ట్ కార్మికులందరూ పాల్గొని తమ వేతనాలు పెంచుకునేందుకు ప్రభుత్వ మీద ఒత్తిడి తెచ్చేందుకు సింగరేణిలోని అన్ని విభాగాల కాంట్రాక్ట్ కార్మికులు చలో అసెంబ్లీకి తరలిరావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో టియుసిఐ జిల్లా నాయకులు గూడూరి వైకుంఠం, ఆడెపు శంకర్, ఇనుగాల రాజేశ్వర్, మంతిని దుర్గయ్య, లక్ష్మి, గట్టయ్య, మహేష్, రాయమల్లు, గట్టమ్మ తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App