బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ భేటీ
Trinethram News : Telangana : బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన పార్టీ శాసనసభాపక్ష సమావేశం ప్రారంభమైంది. ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసంలో కొనసాగుతున్న ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సోమవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేస్తున్నారు.
ఏడాదిగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ప్రజావ్యతిరేక విధానాలు, ఆయా వర్గా ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను అసెంబ్లీ వేదికగా ఎత్తిచూపేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలుస్తోంది. హైడ్రా, లగచర్ల ఉదంతాలతో దేశవ్యాప్తంగా తెలంగాణ ప్రతిష్ఠ ఏ విధంగా మసకబారుతున్నది? కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలపై ప్రజల ఎదురుచూపు, నిరసన వంటి అంశాలను సభ దృష్టికి తేవడానికి ఏయే చర్యలు తీసుకోవాలి? వంటి అంశాలపై కేసీఆర్ మార్గనిర్దేశం చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App