TRINETHRAM NEWS

Trinethram News : Kadapa : 06-12-2024

అంబేద్కర్ సేన మాల మహానాడు సంఘాల ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 68 వర్ధంతికి ఘనమైన నివాళులు

ఈరోజు కడప జిల్లా ప్రొద్దుటూరుపట్టణంలో మైదుకూరు రోడ్డు పాండురంగ స్వామి టెంపుల్ దగ్గర ఉన్న డాక్టర డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కి విగ్రహానికి వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ సేన, మాల మహానాడు సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా పూలదండలు వేసి నివాళులర్పించడం జరిగింది.

ఈ సందర్భంగా అంబేద్కర్ సేన రాష్ట్ర కన్వీనర్ దప్పెల్ల దేవదాసు మాట్లాడుతూ అంటరానితనం, వివక్షతలపై, అలుపెరగని పోరాటం చేసి, అస్తిత్వ ఉద్యమాలకు దశదిశలను చూపిన స్ఫూర్తి ప్రదాత.కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నింపి, అక్షరాన్ని ఆయుధంగా మలిచి, జ్ఞానాన్ని ప్రపంచ ఎల్లలు దాటించినా మహోన్నత వ్యక్తి..సమసమాజ స్వప్నికుడు, స్థాపకుడు, అణగారిన వర్గాల ఆరాధ్య దైవం, ప్రగతి ప్రదాత, విశ్వజ్ఞాని.దేశంలోని బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసిన మహనీయుడు.స్వేచ్ఛ, సమానత్వం మరియు సౌభాతృత్వాన్ని ఆర్థికంగా, సామాజికంగానూ, రాజకీయ పరంగాను సమానత్వ అవకాశం కల్పించిన మహోన్నత వ్యక్తికి…. నివాళులు అర్పిస్తున్నాము.

ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సేన రాష్ట్ర కన్వీనర్ దప్పెల్ల దేవదాసు, వై.రాజు మాల మహానాడు పొద్దుటూరు నియోజవర్గ అధ్యక్షుడు ఎం. ప్రశాంత్ కుమార్ (కెనడా.బ్యాంక్.Rtd) విజయ్, పాల్గొనడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App