ఆస్తి కోసం అన్నను హతమార్చిన తమ్ముడు
జగిత్యాల జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
జగిత్యాల జిల్లాలో సోమవారం అర్ధరాత్రి దారుణ సంఘటన చోటుచేసుకుంది, ఆస్తికోసం సొంత అన్ననే అతి దా రుణంగా హతమార్చాడు,
వివరాల్లోకి వెళ్తే..జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కుమ్మరిపల్లి గ్రామంలో సోమవారం రాత్రి దారుణ హత్య జరిగింది. గత కొద్ది రోజులుగా కుటుంబ కలహాలు ఆస్తి తగాదాల నేపథ్యంలో అన్నదమ్ముల మధ్య గొడవలు చోటు చేసుకుంటుండగా
పరాకాష్టగా విచక్షణ మరిచి ఆస్తి కోసం రక్తం పంచుకుని పుట్టిన అన్న ఢిల్లీ సుమన్ (36)ను తమ్ముడు డిల్లేష్ సోమవారం రాత్రి దారు ణంగా హత్య చేశాడు. కుమ్మరి పల్లి గ్రామానికి చెందిన ఢిల్లీ సుమన్, ఢిల్లీష్,ఇద్దరు రక్తం పంచు కుపుట్టిన అన్నదమ్ములు
ఇద్దరికీ కుటుంబ కలహాలు ఆస్తి తగాదాల నేపథ్యంలో తరుచుగా గొడవలు జరుగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం ఇదే విషయం లో తమ్ముడు డిల్లేష్ పై అన్న దాడి చేయగా తృటిలో తప్పించుకున్నట్లు సమాచారం.
ఆ గొడవ సద్దుమణిగింది. అయితే అన్న సుమన్ ను భార్య వదిలేసి వెళ్ళగా తల్లిదండ్రులతోనే కలిసి ఉంటున్నాడు. రాత్రి ఇంటిలో కూర మంచిగా లేదని కోడి గుడ్లు తెచ్చు కోవడానికి అతడు దుకాణం వద్దకు వెళ్ళాడు. కొద్ది రోజులుగా అన్నపై కోపంతో రగిలిపోతున్న డీల్లేష్, ఇదే అవకాశం గా భావించి,తమ్ముడు అతన్ని రహస్యంగా వెంబడించాడు.
దుకాణం ముందరే ఎటాక్ చేసి పదునైన ఆయుధంతో దారుణంగా పొడిచి చంపా రు. కోడిగుడ్ల కోసం వెళ్ళిన కొడుకు ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో అతని తల్లి వెతుక్కుంటూ దుకాణం వరకు వెళ్లేసరికి అతడు రోడ్డు పై శవంగా రక్తపు మడుగులో దుకాణం ముందు పడి ఉన్నాడు.
వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా సీఐ రామ్ నర్సింహారెడ్డి, ఎస్ఐ ఉమాసాగర్ ఘటనాస్థలా నికి చేరుకొని జరిగిన సంఘటన గురించి తెలుసు కొని అనుమానితులైన మృతుడి తమ్ముడు ఢిల్లేష్ తో పాటు గ్రామానికి చెందిన మరొకరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App