TRINETHRAM NEWS

టిడిపి కార్యాలయంలో ఘనంగా నూతన సంవత్సరం వేడుకలు..
జీవికి న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపేందుకు తరలివచ్చిన అభిమానులు
ప్రజలతో కిక్కిరిసిన టిడిపి శిబిరం.
జీ.వికి ఆశీర్వచనం అందించిన వేద పండితులు

వినుకొండలోని పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు నివాసం నందు సోమవారం నూతన సంవత్సర శోభ వెల్లివిరిసింది.

జీవి ఆంజనేయులు న్యూ ఇయర్ కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఉదయం 9 గంటల నుండి టిడిపి నాయకులు కార్యకర్తలు, అభిమానులు ప్రజలు జీవి ఇంటి వద్ద ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు బారులు తీరారు. ఓం శాంతి ఆశ్రమంలో జరిగిన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి జీవి ఆంజనేయులు హాజరయ్యారు. అనంతరం వేద పండితులు పురోహిత సంఘం పూజారులు తరలివచ్చి ఆయనకు ఆశీర్వచనం అందించారు. 9:30 గంటలకు జీవి ఆంజనేయులు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు అందుబాటులోకి రాగానే అభిమానులు ఒక్కసారిగా తరలివచ్చి పూలమాలలు, పుష్పగుచ్చాలు, పండ్లు, నోట్ పుస్తకాలు, పెన్నులు, డైరీలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ వారి అభిమానాన్ని చాటుకున్నారు. ఉదయం నుండి సాయంత్రం 3:30 గంటల వరకు ప్రజలతో కిక్కిరిసిపోయింది. వినుకొండ నియోజకవర్గంలోని టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీలకు అతీతంగా ప్రజలు వేలాదిగా తరలివచ్చి జీవీ ఆంజనేయులుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. టీచర్స్ యూనియన్ల ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆర్టీసీ కార్మికులు, ఆర్ఎంపీ డాక్టర్లు, టైలర్స్ అసోసియేషన్, బేల్దారు యూనియన్, ఆటో యూనియన్, ఆటోమొబైల్స్ యూనియన్లతోపాటు పట్టణంలోని అన్ని వ్యాపార సంఘాలు డాల్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రైవేటు టీచర్ల సంఘం అన్ని రంగాల వ్యాపారులు కార్మికులు సామాన్య ప్రజలందరూ శుభాకాంక్షలు తెలిపేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వేలాదిమంది అభిమానులతో టిడిపి శిబిరం జన సందోహంగా మారింది. పార్టీలకు అతీతంగా నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి జీవీ ఆంజనేయులు అభిమానులు టిడిపి శిబిరం వద్దకు వచ్చి ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వినుకొండ నియోజకవర్గ జనసేన నాయకులు కొంజేటి శ్రీనివాసరావు రాయల్ ఆధ్వర్యంలో జనసేన కార్యకర్తలు కలిసి జీవి ఆంజనేయులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ నూతన సంవత్సరం ప్రజలందరూ ఆయురారోగ్యాలతో పాడిపంటలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరారు. జన్మభూమి రణం తీర్చుకునేందుకు నేను నియోజకవర్గ ప్రజలందరికీ అందుబాటులో ఉండి వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ అండగా నిలుస్తానని తెలిపారు. శివశక్తి లీల అండ్ అంజన్ ఫౌండేషన్ ద్వారా 25 ఏళ్లగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ పేద ప్రజలకు అండగా నిలుస్తూ ప్రజల ఆదరణ అభిమానాలు పొందామన్నారు. అలాగే కొత్త సంవత్సరంలో ఫౌండేషన్ ద్వారా నియోజకవర్గ ప్రజలకు వారి ఆదరణ అభిమానాలతో మరిన్ని మెరుగైన సేవా కార్యక్రమాలు రాజకీయాలకతీతంగా చేపడతామని తెలిపారు. కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు, నియోజకవర్గ ప్రజలకు తాను అండగా నిలుస్తానన్నారు. ప్రజలకు ఎటువంటి కష్టం వచ్చినా సమస్య ఎటువంటిదైనా తన దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ సందర్భంగా తరలివచ్చిన అభిమానులకు ప్రజలకు భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.