విద్యుత్ సరఫరా పనులను వేగవంతంగా పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ కోయ హర్ష
*డిమాండ్ కు అనుగుణంగా అవసరమైన ట్రాన్స్ ఫార్మర్లను సిద్ధం చేయాలి
*ముఖ్యమంత్రి సభ నిర్వహణ స్థలంలో ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
పెద్దపల్లి, డిసెంబర్- 02: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొనే సభా ప్రాంగణం వద్ద విద్యుత్ సరఫరాకు సంబంధించిన పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కోయ హర్ష సంబంధిత అధికారులకు సూచించారు.
సోమవారం జిల్లా కలెక్టర్ కోయ హర్ష డిసెంబర్ 4న ముఖ్యమంత్రి పాల్గొనే సభా ప్రాంగణం (పెద్ద రంగంపల్లి సబ్ స్టేషన్ సమీపంలో) వద్ద జరుగుతున్న ఏర్పాట్లను టి.జి.ఎన్.పి.డి.సి.ఎల్ ఎం.డి వరుణ్ రెడ్డి తో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ హర్ష మాట్లాడుతూ, లక్ష మంది ప్రజలతో భారీ బహిరంగ సభ డిసెంబర్ 4 సాయంత్రం పెద్దపెల్లి జిల్లాలో జరుగనున్నందని, ఈ కార్యక్రమానికి ముఖ్య మంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు హాజరవుతారని, ఇక్కడ అవసరమైన విద్యుత్ సంబంధిత పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
పార్కింగ్ వద్ద అవసరమైన లైటింగ్ ఉండేలా చూడాలని, కార్యక్రమ నిర్వహణకు వీలుగా అవసరమైన లోడ్, డిమాండ్ తట్టుకునేలా ట్రాన్స్ ఫార్మర్లను ఏర్పాటు చేయాలని అన్నారు. లైటింగ్ కు వైరింగ్ పనులు సజావుగా పకడ్బందీగా జరిగేలా చూడాలని అన్నారు. సభాస్థలి వద్ద అదనపు ట్రాన్స్ ఫార్మర్లను సిద్ధం చేసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లో విద్యుత్ అంతరాయం కల్గకుండా జాగ్రత్తలు పాటించాలని అన్నారు.
ముఖ్యమంత్రి పాల్గొనే సాయంత్రం జరుగుతున్న నేపథ్యంలో వెలుతురుకు ఎటువంటి సమస్య లేకుండా లైటింగ్ ఏర్పాట్లు ఉండాలని అన్నారు. స్టేజ్ పై బ్యాక్ గ్రౌండ్ లో ఎల్.ఈ.డి స్క్రీన్ , ఆడియో సిస్టం లకు విద్యుత్ కనెక్షన్ పక్కాగా అందించాలని అన్నారు.
ముఖ్యమంత్రి పాల్గొనే సభలో గ్రూప్ 4, ఇతర వివిధ పోటీ పరీక్షలకు కింద ఎంపికైన 9 వేల మది అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలను పంపిణీ చేయడం జరుగుతుందని, ఈ సభలో రుణమాఫీ జరిగిన రైతులు, పెద్ద సంఖ్యలో మహిళలు, ప్రజలు పాల్గొనే అవకాశం ఉన్నందున అవసరమైన ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయాలని కలెక్టర్ తెలిపారు.
ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా సభాస్థలి వద్ద పార్కింగ్ సదుపాయాలను కలెక్టర్ పరిశీలించి అక్కడ చేయాల్సిన ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు.
ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట ఆర్డీవో గంగయ్య , కమిషనర్ వెంకటేష్, తహసిల్దార్ రాజ్ కుమార్, ఈఈ ఆర్ &బీ భావ్ సింగ్,సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App