దేశంలో సబ్బుల ధరలూ పెరిగాయ్..
Trinethram News : ఢిల్లీ : హిందుస్థాన్ యునిలీవర్ లిమిటెడ్ (హెచ్‌యూఎల్), విప్రో సహా పలు దిగ్గజ ఎఫ్‌ఎమ్‌సీజీ సంస్థలు సబ్బుల ధరలను 7-8% పెంచాయి. ‘సబ్బుల తయారీలో కీలక ముడి సరకు అయిన పామాయిల్ ధర ఈ ఏడాది ప్రారంభం నుంచి 30 శాతానికి పైగా పెరిగింది..
అందుకే ప్రధాన సంస్థలన్నీ సబ్బుల ధరలను దాదాపు 7-8% పెంచాయి. మార్కెట్ ధోరణికి అనుగుణంగానే మేం ధరల్లో సర్దుబాటు చేస్తుంటామ’ని విప్రో కన్జూమర్ కేర్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి నీరజ్ ఖత్రి తెలిపారు. మరోవైపు హెచ్‌యూఎల్ కూడా సబ్బుల ధరలను పెంచింది. లక్స్ ధరను (5 సబ్బుల ప్యాక్) రూ.145 నుంచి రూ.155కు; లైఫ్‌బాయ్ ధర (5 సబ్బుల ప్యాక్) రూ.155 నుంచి రూ.165; పియర్స్ ధర (4 సబ్బుల ప్యాక్) రూ.149 నుంచి రూ.162కు పెంచింది.
టీ పొడి ధర కూడా: ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల ఉత్పత్తి తగ్గడంతో టీ పొడి ధరలను టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్, హెచ్‌యూఎల్ పెంచాయి..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App