జిల్లా వైద్య ఆరోగ్య కార్యాలయం
జిల్లా వైద్య ఆరోగ్య కార్యాలయంలో కుష్టు వ్యాధుల గుర్తింపు కార్యక్రమము ను పురస్కరించుకొని
పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సూపర్వైజర్లకు శిక్షణ కార్యక్రమంలో నిర్వహించడం జరిగినదని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పెద్దపల్లి డాక్టర్ జి అన్న ప్రసన్న కుమార్ అన్నారు.
ఈ కార్యక్రమంను డిసెంబర్ 2 నుండి డిసెంబర్ 15 వరకు 14 రోజులు ఆశలచే ఇంటింటి సర్వే నిర్వహించి వ్యాధిగాస్తులను గుర్తిస్తారు అని అన్నారు. శరీరం రంగు కాకుండా ఏ మచ్చనైనను అనుమానించి వారిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కు పంపించి నిర్ధారణ చేపిస్తారని ఆ విధంగా
ఈ వ్యాధి గల వ్యక్తులను గుర్తించి వారికి తగిన చికిత్స అందించి ఈ వ్యాధిని నివారించడం కొరకు చేపట్టే కార్యక్రమం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ ఆర్ రాజమౌళి, డాక్టర్ కె వి సుధాకర్ రెడ్డి, డాక్టర్ బి శ్రీరాములు మరియు దేవి సింగ్, శ్రీమతి సువార్త జిల్లా పారామెడికల్ ఆఫీసర్లు మరియు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రములకు చెందిన సూపర్వైర్లు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App