కూలీ రేట్లు పెంచాలని అడిగితే హమాలీ కార్మికులను తిడుతారా!
గోదావరిఖని కూరగాయల మార్కెట్ వ్యాపారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి.
హమాలీ లకు కూలీ రేట్లు పెంచకుంటె ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తాం.
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
హమాలీల ఆందోళన కు సంఘీభావం తెలిపి ప్లే కార్డులతో నిరసన వ్యక్తం చేసిన డి.హెచ్.పి.ఎస్ జిల్లా కన్వీనర్ మద్దెల దినెష్.
గోదావరిఖని కూరగాయల మార్కెట్ లో హమాలీ కార్మికుల కు కూలీ రేట్లు పెంచాలని అడిగితే పెంచకుండా హోల్ సేల్ వ్యాపారులు హమాలీ కార్మికులను బూతులు మాట్లాడుతు తిట్టడం ఏం సంస్కృతి అని, హమాలీ కార్మికుల ను తిట్టిన కూరగాయల మార్కెట్ హోల్ సేల్ వ్యాపారుల పై ప్రభుత్వం, పోలీసు అధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని, లేనిచో ఆందోళన కార్యక్రమాలు వ్యాపారుల వైఖరి కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున చేపడతామని దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ మద్దెల దినెష్ హెచ్చరించారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App