Collector Koya Harsha : 1503 రైతులకు బోనస్ కింద 5 కోట్ల 91 లక్షల పైగా బోనస్ చెల్లింపు జిల్లా కలెక్టర్ కోయ హర్ష

TRINETHRAM NEWS

1503 రైతులకు బోనస్ కింద 5 కోట్ల 91 లక్షల పైగా బోనస్ చెల్లింపు జిల్లా కలెక్టర్ కోయ హర్ష

*ప్రతి క్వింటాల్ సన్న రకం ధాన్యానికి 500 రూపాయల బోనస్

*సన్న రకం ధాన్యం కొనుగోళ్ల పై ప్రకటన విడుదల చేసిన జిల్లా కలెక్టర్

పెద్దపల్లి, నవంబర్ -19:- త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

పెద్దపల్లి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా మొత్తం 1503 మంది రైతుల నుండి లక్ష 18 వేల 260 క్వింటాళ్ల సన్న రకం ధాన్యం కొనుగోలు చేసి 5 కోట్ల 91 లక్షల 30 వేల 600 రూపాయల బోనస్ చెల్లించామని జిల్లా కలెక్టర్ కోయ హర్ష మంగళవారం ఒక ప్రకటనలో అన్నారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు సన్న రకం దాన్యం ప్రత్యేకంగా కొనుగోలు చేస్తున్నామని, ప్రతి క్వింటాల్ సన్న రకం ధాన్యానికి 500 రూపాయల బోనస్ చెల్లిస్తున్నామని, నవంబర్ 14 నుంచి నవంబర్ 18 వరకు మొత్తం 1503 రైతుల నుంచి లక్ష 18 వేల 260 క్వింటాళ్ల సన్న రకం ధాన్యం కొనుగోలు చేసి 5 కోట్ల 91 లక్షల 30 వేల 600 రూపాయల బోనస్
చెల్లించడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లిచే జారీ చేయనైనది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top