ఈరోజు కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (CDMA) డైరెక్టర్ శ్రీమతి దాసరి హరిచందన ఐఏఎస్ గారు,అడిషనల్ డెరైక్టర్ జాన్ శాంసన్ గారు,గౌరవ మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి గారు,కమిషనర్ రామకృష్ణారావు గారితో కలిసి బాచుపల్లి 15,17,మరియు 19వ డివిజన్ల పరిధిలో ప్రజా పాలన అభయహస్తం ధరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పరిశీలించి పర్యవేక్షించడం జరిగింది.ఈ సందర్భంగా దరఖాస్తుల స్వీకరణ కేంద్రాలను సందర్శించి,దరఖాస్తు దారులతో ముచ్చటించి,అర్హులైన ప్రతీ ఒక్కరికీ సంక్షేమ పథకాలు లబ్ది చేకూరేలా కృషి చేయాలని,ప్రజా పాలన కేంద్రాలకు వచ్చే ప్రజలకు దరఖాస్తు ఫారాలను అందుబాటులో ఉంచాలని అధికారులకు,సిబ్బందికి సూచించారు.ఈ కార్యక్రమంలో ఆయా డివిజన్ల కార్పొరేటర్లు గాజుల సుజాత,ఆగం రాజు ముదిరాజ్,NMC అధికారులు మేనేజర్ చంద్ర ప్రకాష్, సుకృత,ఇతర అధికారులు, సిబ్బంది,ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజా పాలన అభయహస్తం ధరఖాస్తుల స్వీకరణ
Related Posts
జర్నలిస్ట్ లు ఆరోగ్యంపై శ్రద్ద చూపాలి : ఐఎంఏ ప్రెసిడెంట్ క్యాస శ్రీనివాస్
TRINETHRAM NEWS జర్నలిస్ట్ లు ఆరోగ్యంపై శ్రద్ద చూపాలి : ఐఎంఏ ప్రెసిడెంట్ క్యాస శ్రీనివాస్ గోదావరిఖని : త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గోదావరిఖని నిత్యంప్రజా సమస్యలు పరిష్కరించడం కోసం కాలంతో పోటీపడుతూ ఒత్తిడిలో పనిచేసే జర్నలిస్ట్ లు తమ ఆరోగ్యంపై…
బిజెపి కార్యక్రమాలకి చిరంజీవికి ఆహ్వానం అందుకే..! సంచలన కామెంట్ చేసిన కిషన్ రెడ్డి
TRINETHRAM NEWS బిజెపి కార్యక్రమాలకి చిరంజీవికి ఆహ్వానం అందుకే..! సంచలన కామెంట్ చేసిన కిషన్ రెడ్డి Trinethram News : Telangana : మెగా స్టార్ చిరంజీవి వరుసగా సినిమాలను లైనప్ చేసి ఆ షూటింగ్స్ తో బిజీగా గడుపుతున్నారు. ఓ…