TRINETHRAM NEWS

వరంగల్ జిల్లాలో అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు

కోకిల డిజిటల్ మీడియా
వరంగల్ జిల్లా: ప్రతినిధి

వరంగల్ జిల్లా డిసెంబర్ 12
వరంగల్ జిల్లా లోని దామెర మండలం ఓగులాపూర్ గ్రామం సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది.

ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.వెంటనే గాయపడిన వారిని చికిత్స కోసం దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు.

ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 70మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.

వరంగల్ 2 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మంగళవారం ఉదయం హనుమకొండ నుంచి ఏటూరునాగారం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలిసింది.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి విరాలు తెలియాల్సి ఉంది…