తెలంగాణ సచివాలయం ప్రధాన గేట్లు, రోడ్లలో కీలక మార్పులు
Trinethram News : హైదరాబాద్: సచివాలయం ప్రధాన గేట్లు, రోడ్లలో కీలక మార్పులు చేస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం తూర్పు వైపు ఉన్న బాహుబలి గేటుగా పిలిచే ప్రధాన గేటును పూర్తిగా తొలగించారు..
ఈశాన్యం వైపు మరొక గేటు నిర్మిస్తున్నారు. ఇందుకోసం ఇనుప గ్రిల్స్‌ను తీసేశారు. దాదాపు రూ.3 కోట్ల వ్యయంతో ప్రభుత్వం మార్పులు చేస్తోంది. సచివాలయానికి ప్రస్తుతం నాలుగు వైపులా ప్రధాన గేట్లు ఉన్నాయి.
తూర్పు వైపు లుంబనీ పార్క్ ఎదురుగా ఉన్న బాహుబలి గేటు నుంచి కేసీఆర్ రాకపోకలు సాగించేవారు. ఆ గేటు నుంచి సచివాలయం లోపల ప్రధాన ద్వారం వరకు రాకపోకలు కొంతకాలంగా నిలిపివేశారు. ఆ మార్గంలోనే తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు చుట్టూ లాన్, ఫౌంటెయిన్లు ఏర్పాటు చేస్తున్నారు. నైరుతి, ఈశాన్య గేట్లను కలుపుతూ రోడ్డు నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ గేట్లు మార్పు విషయం చర్చనీయాంశమైంది..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App