TRINETHRAM NEWS

ప్రజలకు ఇచ్చిన ఆరు వాగ్దానాలను అమలు చేయాలి

న్టీపీసీ ప్రజాభిప్రాయ సేకరణలో అభిప్రాయాలు చెప్పుకునే విధంగా ప్రజలకు స్వేచ్ఛనివ్వాలి

సీపీఐ (ఎం.ఎల్) మాస్ లైన్ ప్రజా పంథా రాష్ట్ర నాయకులు నంది రామయ్య పిలుపు

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

సీపీఐ ఎం ఎల్ మాస్ లైన్ ప్రజా పంథా కరీంనగర్ ఉమ్మడి జిల్లా కమిటీ సమావేశము గోదావరిఖని లో జరిగింది. ఈ సమావేశంలో సీపీఐ ఎం ఎల్ మాస్ లైన్ ప్రజా పంథా రాష్ట్ర నాయకులు నంది రామయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తాను ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలను అమలు చేయకుండా తాత్సారం చేయడం సరికాదని, వెంటనే యిచ్చిన అన్ని వాగ్దానాలను అమలు చేయాలని సీపీఐ (ఎం-ఎల్) మాన్లైన్ ( ప్రజాపంథా) డిమాండ్ చేసింది. సీపీఐ(ఎం-ఎల్) మాస్ లైన్ రాష్ట్ర కమిటీ సమావేశాలు ఖమ్మంలో నవంబర్ 14,15,16 తేదీలలో జరిగాయి ఈ సమావేశంలో పలు రాజకీయ అంశాలను పలు సమస్యలను చర్చించింది. భవిష్యత్తు కార్యక్రమాలను తీసుకున్నది వికారాబాద్ జిల్లా లగచర్ల తదితర గ్రామాలపై పోలీసుల దాడులు ఆపాలి. అక్రమ అరెస్టులు ఆపాలి. రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలి. రైతులు తమ భూముల రక్షణ కోసం చేసిన పోరాటాన్ని సీపీఐ (ఎం-ఎల్) మాన్లైన్ బలపరుస్తున్నది. భూములు కోల్పోతున్న రైతుల అభీష్టం మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. బలవంతంగా భూములు తీసుకోవద్దు. ఫార్మ కంపెనీల ప్రయోజనాలకు అనుకుణంగా నిర్ణయం తీసుకోవడం అన్యాయం. సీపీఐ (ఎం-ఎల్) మాస్లైన్ బృందం లగచర్ల సందర్శిస్తుంది. రైతులకు మద్దతు యిస్తుంది.
పత్తి రైతుల పంటను తేమతో సంబంధం లేకుండా సీసీఐ అన్ని సెంటర్లు కొనుగోలు చేయాలి. సీసీఐ నత్తనడకను కొనగోలు చేయడం, ఖరీదు దార్లతో కుమ్మక్కయి రైతుల పంటలను నిరాకరిస్తున్నారు. కానీ వ్యాపారస్థుల పంటలను పెద్దఎత్తున కొనుగోలు చేస్తున్నారు. బయట మార్కెటులో ధరలు తగ్గించి కొంటున్నారు. ప్రభుత్వం వెంటనే రైతుల పంటను కొనుగోలు చేయాలి. అలానే దాన్యం కొనుగోళ్లు కూడా వెంటనే చేయాలి. అన్ని రకాల దాన్యానికి ప్రభుత్వం బోనస్ యివ్వాలి.
సీపీఐ(ఎం-ఎల్) లైన్ ప్రజా పంథా ప్రతినిధి బృందాలు మార్కెట్లను సందర్శించి అక్కడి సమస్యలపై ఆందోళనలు నిర్వహించాలి ఉచిత గ్యాస్, కరెంట్ వినియోగాదారులకు అందరికి అందితీరాలి. చాలమంది టెక్నికల్ కారణాలతో నిరాకరిస్తున్నారు. దీనిపై స్థానికంగా ప్రచారం చేసి ఆందోళనలు నిర్వహించాలని పిలుపునిస్తున్నాం స్త్రీలకు ఉచిత బస్సు ప్రయాణం యిచ్చి, బస్సులను 3000 వేలు తగ్గించారు. దీనితో ప్రయాణికులు అరిగోస పడుతున్నారు. స్టాప్లో ఆగక, లోపల జాగలేక ఎన్నో యిబ్బందులకు గురవుతున్నారు. ప్రయాణికులకు సరిపడా ఐస్సులనపు వేయాలని, స్త్రీలకు ఉచితం యిచ్చి, వారిని అవమానించే విధంగా వ్యవహరించడం సరికాదు.దీనిపై డిసెంబర్ 4వ తేదీన డిపోలముందు, హైదరాబాద్లో బస్ భవన్ ముందు ధర్నాలు చేయాలని . దేశంలో మోదీ ప్రభుత్వం విద్వేషాలను రెచ్చగొట్టడమే ఒక విధానంగా పెట్టుకుందని, విద్వేష ఉన్మాద విధానాలను అనుసరిస్తుందని అన్నారు.మహారాష్ట్ర, హార్యాణ, జార్ఖండ్ ఉపఎన్నికలలో తన స్థాయిని విడిచి ప్రసంగిస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పట్ల వివక్ష చూపుతుందని అన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో దండకారణ్యంలో ఆదివాసీ ప్రజల నిర్మూలనకు పూనుకుంటుందని విమర్శించారు. వేలదిమంది సైన్యాన్ని దింపి, కేంద్ర ప్రభుత్వం యుద్ధం చేస్తుందని విమర్శించారు. బూటకపు ఎన్ కౌంటర్లు పెద్ద ఎత్తున చేస్తుందన్నారు.రాష్ట్రంలోని రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయగపోగా, హైడా పేరుతో, ఫార్మకంపెనీ కోసం భూసేకరణ పేరుతో ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నరని అన్నారు. రాష్ట్రములోని ప్రజల సమస్యలను దృష్టి మళ్ళీంచడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రాజకీయ క్రీడ సడుపుతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య మటాల యద్ధం ప్రజల కోసం కాదని, వారి అధికార ప్రయోజనాల కోసం చేస్తుందని అన్నారు.న్టీపీసీ నూతనంగా ఏర్పాటు చేయనున్న విద్యుత్ ప్లాంట్ కోసం జరగనున్న ప్రజా అభిప్రాయ సేకరణలో ప్రజలంతా స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పుకునే వెసులుబాటు కల్పించాలని డిమాండ్ గతంలో ఎన్టిపిసి ఏర్పాటులో భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకు తక్షణమే ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం
ఈ సమావేశంలో సీపీఐ ఎం ఎల్ మాస్ లైన్ ప్రజా పంథా కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ జిల్లా నాయకులు తోకల రమేష్ , గుమ్మడి వెంకన్న అడేపు శంకర్ గూడూరి వైకుంఠం, గొల్లపల్లి చంద్రయ్య పెండ్యాల రమేష్ , కోడిపుంజుల లక్ష్మి, కట్ట తేజేశ్వర్ , తిగుట్ల రాములు, కాలువల రాయమల్లు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App