నవభారత నిర్మాత పండిత్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి వేడుకలు గణగంగా నిర్వహించిన NSUI నాయకులు మెంటం ఉదయ్ రాజ్
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం నియోజికవర్గ మ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ నేతృత్వం లో NSUI జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మెంటం ఉదయ్ రాజ్ ఆధ్వర్యం లో నవభారత నిర్మాత , భారత దేశపు మొదటి ప్రధాన మంత్రి పండిత్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా తన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగినది
ఈ సందర్భంగా మెంటం ఉదయ్ రాజ్ , తిపరపు శ్రీనివాస్ మాట్లాడుతూ
నవ భారత నిర్మాత పండిత్ జవహర్ లాల్ నెహ్రూ స్వతంత్రం కోసం సుమారు 10 సంవత్సరాలు జైల్ జీవితాని అనుభవించి , వారి ఆస్తులను సైతం స్వాతంత్ర పోరాటం కోసం దారపోసి 1951-53 మధ్యకాలం లో జరిగిన భారత దేశపు తొలి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి చరిత్ర లో నిలిచి పోయే విధం గా దేశ తొలి ప్రధానమంత్రి గా నిలిచిన చరిత్ర జవహర్ లాల్ నెహరు అని తెలియజేశారు
తాను ప్రవేశపెట్టిన పంచ వర్ష ప్రణాళికల వల్లే ఈ రోజు దేశం ఆర్థికంగా బలంగా ఉందని చెప్పారు తన హాయం లోనే ముందు చూపు తో బారి పరిశ్రమలు , హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించారని తెలిపారు…
నాగార్జున సాగర్ , శ్రీశైలమ్ లాంటి భారీ సాగు నీటి సరఫరా ప్రాజెక్టులు నిర్మించి భారత దేశంలో వ్యవసాయ రంగానికి జీవం పోసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ హయాం లో నెహ్రూ చేసిన అభివృద్ధి అని తెలిపారు
ఫారిన్ పాలసీ విధానం ద్వారా ఇతర దేశాలతో మంచి ఒప్పందాలు చేసుకొని వారి చేత పెట్టుబడులు పెట్టించి తద్వారా అభివృద్ధి కి బాటలు వేసిన ఘనత ఆయనకే దక్కుతుంది అన్నారు
దేశం లో ప్రతి పౌరుడు చదుకోవాలని అపుడే దేశ భవిషత్తు అభివృద్ధి చెందుతుంది అని దేశం లో అత్యుత్తమ విద్యా సంస్థలను అనగా IIT,IIM,CSIR ఏర్పాటు చేసి దేశ విద్యా వ్యవస్థను పటిష్టం చేయడానికి కృషి చేసిన ప్రధాని కేవలం నెహ్రూ వల్లే అని అన్నారు
ఇంకా అనేక రంగంలో దేశ అభివృద్ధికి పునాదులు వేసిన ఘనత నేహు కి మాత్రమే సొంతం అని అన్నారు
తనకి పిల్లలు ఆంటీ అపారమైన ప్రేమ అని అందుకే తన జన్మదినాన్ని పురస్కరించుకుని బాలల దినోత్సవం గా నాటి భారత ప్రభుత్వం ప్రకటించింది అని అన్నారు
ఇంత గొప్ప చరిత్ర కలిగిన మహావ్యక్తి అయిన నెహ్రూ గారి గురించి కొందరు ఉద్దేశ పూర్వకంగా చరిత్ర ని వక్రీకరించి సోషల్ మీడియా లో పైడ్ ప్రమోషన్స్ చేస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వాటిని యువత ఖండించాల్సిన అవసరం ఉందని మెంటంఉదయ్ రాజ్ అన్నారు
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామగుండం కార్పొరేషన్ ప్రెసిడెంట్ బొంతల రాజేష్ , పట్టణ అధ్యక్షులు తీపారపు శ్రీనివాస్ హాజరయ్యారు,
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఎండీ ముస్తఫా ప్రకాష్ , కొమ్ము వేణు , దొంతు శ్రీనివాస్ పార్టీ సీనియర్ నాయకులు బొమ్మక రాజేష్ ,గట్ల రమేష్ ఓదెలు , కౌటం సతీష్ ,నజీముద్దీన్, పంజా శ్రీనివాస్ , నమిండ్ల ఎల్లేష్ ,బండి రామ్ , మరువక శంకర్ , శ్యామ్ , సుమంత్ , కిరణ్ , రోహిత్ తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App