Today in History : చరిత్రలో ఈరోజు నవంబర్ 08

TRINETHRAM NEWS

Trinethram News : చరిత్రలో ఈరోజు నవంబర్ 08…

Trinethram News : సంఘటనలు

1947: జూనాగఢ్ సంస్థానం భారత్‌లో విలీనమయ్యింది.

1948: మహత్మా గాంధీని హత్య చేసినట్లుగా నాథూరాం గాడ్సే అంగీకరించాడు, కాని కుట్ర చేసినట్లుగా ఒప్పుకోలేదు.

2016: రు.500, రు.1000 నోట్లను భారత ప్రభుత్వం రద్దు చేసింది.

జననాలు

1656: ఎడ్మండ్‌ హేలీ, హేలీ తోకచుక్క ను కనుగొన్న హేలీ ఇంగ్లండు లో హేగర్‌స్టన్‌ లో ఒక ధనిక కుటుంబంలో జన్మించాడు. (మ.1742)

1908: రాజారావు, ప్రముఖ ఆంగ్ల నవలా, కథా రచయిత. పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత (మ.2006).

1927: లాల్ కృష్ణ అద్వానీ, భారతీయ జనతా పార్టీ నాయకుడు.

1969: ఎనుముల రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రస్తుత ముఖ్యమంత్రి.

మరణాలు

1971: పూతలపట్టు శ్రీరాములురెడ్డి, ప్రముఖ తెలుగు కవి, అనువాదకులు (జ.1892).

1977: బి.ఎన్.రెడ్డి, తెలుగు సినిమా దర్శకుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తొలి దక్షిణ భారతీయుడు (జ.1908).

2013: ఎ.వి.ఎస్ గా పేరు గాంచిన ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం. తెలుగు సినిమా హాస్యనటుడు, రచయిత, దర్శకుడు, నిర్మాత మరియు రాజకీయనాయకుడు (జ.1957).

జాతీయ దినాలు

అంతర్జాతీయ రేడియాలజి దినం.

You cannot copy content of this page

Scroll to Top